మరో రైటర్ దర్శకుడిగా...
నాగార్జున మేనల్లుడు సుశాంత్ అప్పుడే రెండో సినిమాకు రెడీఅవుతున్నాడు. వర్షం, నువ్వొస్తానంటే నే వద్దంటానా చిత్రాలకు కథలందించిన వీరుపోట్ల దర్శకత్వంలో ఈ సినిమా రానుందిట. 'కాళిదాసు" బాక్సాఫీసు వద్ద ఫెయిలైనా డాన్సులు, ఫైట్లు బాగా చేశాడనే పేరు తెచ్చుకున్నాడు సుశాంత్. తొలి సినిమాలో మాస్ లుక్ తో కనిపించిన అతను రెండో సినిమాలో తనన తాను మార్చుకోబోతున్నాడు. ఇందులో అతను ఆధునిక యువకుడిగా ఢిఫెరంట్ స్టైల్‌తో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పరుచూరి బ్రదర్స్ శిష్యడైన వీరు పోట్ల స్ర్కిప్ట్ పై మంచి అవగాహన ఉన్న వాడు కావటంతో అతనికి రెండో సినిమా దర్శకత్వ బాద్యతలు అప్పచెప్పినట్లు తెలుస్తోంది. అంటే మరో రైటర్ దర్శకుడుగా మారబోతున్నాడన్నమాట.


Click it and Unblock the Notifications











