Just In
- 30 min ago
మెగా హీరోయిన్ ప్రాణాలకు ముప్పు: ఏకంగా పోలీసులకే వార్నింగ్ కాల్స్.. షాక్‌లో సినీ పరిశ్రమ!
- 36 min ago
నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
- 1 hr ago
ప్రభాస్ ‘సలార్’లో విలన్‌గా సౌతిండియన్ స్టార్ హీరో: ఆ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ యూటర్న్
- 1 hr ago
సావిత్రి మంచిదే అయితే ఎందుకలా చచ్చింది.. అలా చేయడమే తప్పా: షకీలా సంచలన వ్యాఖ్యలు
Don't Miss!
- News
తిరుపతి అభ్యర్థిపై పవన్ కల్యాణ్ కీలక ప్రకటన: వారంలో తేల్చేస్తాం: అసెంబ్లీని ముట్టడిస్తాం
- Sports
'సిడ్నీ టెస్టు తర్వాత ద్రవిడ్ సందేశం పంపించారు.. ఆయన వల్లే మేమిలా ఆడగలిగాం'
- Finance
హీరో మోటోకార్ప్ అరుదైన ఘనత, షారూక్ ఖాన్ చేత 10కోట్లవ యూనిట్
- Lifestyle
మ్యారెజ్ లైఫ్ లో మీ భాగస్వామి ఇష్టపడే గాసిప్స్ ఏంటో తెలుసా...!
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అందరి ముందే బలవంతం.. నిధి అగర్వాల్‌తో డైరెక్టర్ పరాచకాలు
పబ్లిక్ ఫంక్షన్‌లు జరిగే సమయంలో సెలెబ్రిటీలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మాటలు కూడా అదుపులో పెట్టుకుని మాట్లాడాల్సి వస్తుంది. సినిమాలో పని చేయడం ద్వారా ఎంత క్లోజ్ అయినా కూడా పబ్లిక్ ముందు మాట్లాడేప్పుడు మాత్రం కాస్త చూసి వ్యవహరించాల్సి వస్తుంది. అలా కాస్త అదుపు తప్పి ప్రవర్తించడంతో గతంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా ట్రోలింగ్‌కు గురయ్యారు. తాజాగా శింబు హీరోగా వస్తోన్న ఈశ్వరన్ సినిమా ఈవెంట్‌లో జరిగిన విషయం రచ్చగా మారింది.

ఈశ్వరన్‌తో గ్రాండ్ ఎంట్రీ..
నిధి అగర్వాల్‌కు తెలుగులో వరుసగా రెండు ఫ్లాపులు వచ్చాయి. ఆ తరువాత ఇస్మార్ట్ శంకర్ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. దాంతో నిధి దశ తిరిగింది. అయితే తెలుగులో అవకాశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నా కూడా కోలీవుడ్‌లో మాత్రం నిధి దూసుకుపోతోంది. వరుసగా ప్రాజెక్ట్‌లతో బిజీ అయిపోయింది. శింబు ఈశ్వరన్ సినిమాతో నిధి కోలీవుడ్‌లో అడుగుపెట్టిసింది.

ఆడియో ఈవెంట్..
సంక్రాంతి బరిలోకి దిగుతున్న ఈశ్వరన్ ఆడియో లాంచ్ తాజాగా జరిగింది. అయితే ఈ ఈవెంట్ మొత్తం ఒకెత్తు అయితే నిధి అగర్వాల్ మాట్లాడిన మాటలు ఒకెత్తు. అందులో దర్శకుడు సుశీంద్రన్ మధ్యలో కల్పించుకుని నిధిని ఇబ్బంది పెట్టడం ఒకెత్తు. మొత్తానికి ఈవ్వరన్ ఆడియో ఈవెంట్‌లోని ఈ వివాదం చిలికి చిలికి గాలి వానలా తయారైంది.

శింబు మామా..
స్టేజ్ మీద నిధి అగర్వాల్ మాట్లాడుతూ ఉంటే దర్శకుడు మధ్యలో కలగజేసుకున్నాడు. అవన్నీ కాదు ముందు శింబు మామా ఐ లవ్యూ అని చెప్పు అని ఒత్తిడి తెచ్చాడు. అయినా సరే నిధి ఆ మాటలను పట్టించుకోకుండా.. తన ప్రసంగాన్ని కొనసాగించింది. అయినా కూడా ఆ దర్శకుడు మాత్రం వదల్లేదు. ఐ లవ్యూ చెప్పమని బలవంతం చేశాడు.
|
వీడియో వైరల్..
అయితే నిధిని డైరెక్టర్ అలా బలవంత పెట్టడం, తనను మాట్లాడనివ్వకపోవడంపై నెటిజన్లు ఫైర్ అయ్యారు. అలా చేయడం పద్దతి కాదంటూ డైరెక్టర్‌ను ఏకిపారేశారు. ఒత్తిడి తెచ్చి మరీ ఐ లవ్యూ చెప్పించాల్సిన పని ఏముందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై డైరెక్టర్ స్పందించాడు.

అందుకే అలా..
నిధిని అలా చెప్పమనడం వెనుకున్న ఉద్దేశ్యాన్ని డైరెక్టర్ వివరించాడు. ‘మామా.. మామా ఐ లవ్యూ' అంటూ హీరో శింబు వెంటపడే పాత్రలో నిధి అగర్వాల్ నటించిందని, అందుకే తాను ఆడియో లాంచ్ వేదికపై ఆ డైలాగ్ చెప్పాలని హీరోయిన్ నిధి అగర్వాల్‌ను కోరానని, అంతేకానీ ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు.