సుశాంత్‌ గొప్ప మనసుకు ఉదాహరణ.. ఫ్యాన్ అడగడంతో కోటి రూపాయల విరాళం!!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ అకాల మరణం అందర్నీ కలిచివేసింది. అందులోనూ మానసికంగా కుంగిపోయిన సుశాంత్.. ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సుశాంత్ సింగ్ మరణ వార్తతో ఆయనకు సంబంధించిన వార్తలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఈ క్రమంలో సుశాంత్ చేసిన ఓ గొప్ప పని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమాని కోరడంతో కోటి రూపాయలు ఇస్తానని చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

 సుశాంత్ మరణం..

సుశాంత్ మరణం..

సుశాంత్ సింగ్ నేటి ఉదయం బాంద్రాలోని తన స్వగృహంలో మరణించారు. ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సుశాంత్ మరణించడంపై ఆయన అభిమానులతో పాటు సినీ లోకం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా అందరూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

త్వరగా వెళ్లిపోయాడు..

త్వరగా వెళ్లిపోయాడు..

సుశాంత్ మరణంపై స్పందించిన ప్రతీ ఒక్కరూ ఎంతో ప్రతిభ గల నటుడు ఎంతో త్వరగా వెళ్లిపోయాడని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు, అభిమానులకు బలం చేకూరాలని, ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

బయటపడ్డ స్క్రీన్ షాట్..

బయటపడ్డ స్క్రీన్ షాట్..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన ఓ స్క్రీన్ షాట్ ప్రస్తుతం తెగ చక్కర్లుకొడుతోంది. ఇదికేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఓ ఫ్యాన్‌, సుశాంత్‌కు మధ్య జరిగిన సంభాషణ. సుశాంత్ మరణ వార్తతో ఈ స్క్రీన్ షాట్ ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది.

Recommended Video

Sushant Singh Rajput Latest News And His last Instagram Post
 ఫ్యాన్‌కు కోటి విరాళం..

ఫ్యాన్‌కు కోటి విరాళం..

తన వద్ద డబ్బు లేదని, కానీ సాయం చేయాలనుకుంటున్నానని, మరి ఎలా అంటూ సుశాంత్‌ను అడిగాడు సదరు నెటిజన్. అయితే తాను కోటి రూపాయలు ఇస్తానని, నీ పేరు మీద వారికి సాయం చేసుకో ఆపై నాకు తెలియజేయమని సుశాంత్ పేర్కొన్నాడు. సుశాంత్ మనసు ఎంత గొప్పదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X