Sushant Singh Rajput 3rd death anniversary మూడేళ్లుగా అన్యాయం.. సుశాంత్‌ది ముమ్మాటికి హత్యే అంటూ !
బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనూహ్యంగా మరణానికి గురి కావడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. జూన్ 14వ తేదీ 2020 తేదీన ముంబైలోని బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొన్నాడనే వార్త భారతీయ సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. గత మూడేళ్లలో ఎన్నో మలుపులు తిరిగిన సుశాంత్ మృతి దర్యాప్తు కేసు ఇంకా ఎక్కడ వేసినా గొంగళి అక్కడనే ఉన్నట్టు కనిపిస్తున్నది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి, ఆయన కేసు విచారణ వివరాల్లోకి వెళితే..
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తొలుత ఆత్మహత్యగానే భావించారు. కానీ మీడియాలో వచ్చిన కథనాలు, పోస్టుమార్టం నిర్వహించిన తీరు, అలాగే ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాలతో అనేక అనుమానాలు తలెత్తాయి. దాంతో 2020లో బీహార్ పోలీసులు ఈ కేసును ప్రాథమికంగా మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాయి.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో దర్యాప్తును తొలుత ముంబై పోలీసులు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ దర్యాప్తు చేశాయి. అయితే ఇటీవల ఈ కేసు విచారణ గురించి దర్యాప్తు సంస్థలు స్పందిస్తూ.. ఇంకా ఈ కేసు విచారణ జరుగుతున్నది అంటూ వివరణ ఇచ్చారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుపై ఎన్నో అనుమానాలు తలెత్తడంతో సీబీఐ రంగంలోకి దిగింది. డ్రగ్స్ కేసు లింక్ కావడంతో ఆ దిశగా దర్యాప్తు చేపట్టింది. ఈడీ కూడా రంగంలోకి దిగి.. తన ప్రియురాలు రియా చక్రవర్తిని పలుమార్లు విచారించింది. ఆమెను అదుపులోకి తీసుకొని రిమాండ్ విధించింది. అయితే ఈ కేసు దర్యాప్తు జరిగి రెండేళ్లకుపైగా కావొచ్చినా.. సీబీఐ చార్జిషీట్ నమోదు చేయలేదు. అలాగని కేసు కూడా క్లోజ్ చేయకపోవడంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మూడో వర్ధంతిని పురస్కరించుకొని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. సుశాంత్ మరణించి 3 సంవత్సరాలు అవుతున్నాయి. సుశాంత్‌కు మూడేళ్లుగా అన్యాయం జరుగుతూనే ఉంది. జూన్ 14వ తేదీ బ్లాక్ డే అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. ముమ్మాటికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది హత్యే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇది సాధారణమైన ఆత్మహత్య కాదు. సుశాంత్ మరణం వెనుక దారుణమైన కుట్ర ఉంది. సుశాంత్ మరణం వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టే సత్తా కేవలం సీబీఐకి మాత్రమే ఉంది అని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొద్దికాలంగా సీబీఐ మౌనం వహించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











