జీవితంలోని 50 కోరికలు ఇవే.. తీరకుండానే తిరిగి రాని లోకాలకు.. అంతలోపే సుశాంత్ ఆత్మహత్య!!

బాలీవుడ్‌ను వరుస మరణ వార్తలు కుదిపేస్తున్నాయి. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి దిగ్గజ నటులు మృతి చెందిన ఘటన నుంచి తేరుకోక ముందే.. మరో యువ తార నేలకూలింది. ఎంతో భవిష్యత్తు ఉన్న రైజింగ్ స్టార్ ఇలా అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించుకోవడాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. సుశాంత్ మరణ వార్త విన్న తారలంతా కన్నీరు మున్నీరు అవుతున్నారు.

ఉరేసుకుని ఆత్మహత్య..

ఉరేసుకుని ఆత్మహత్య..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏవీ ఇంకా తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మరణ వార్త మాత్రం బాలీవుడ్‌ను శోక సంద్రంలో ముంచెత్తింది.

త్వరగా వెళ్లిపోయాడు..

త్వరగా వెళ్లిపోయాడు..

సుశాంత్ సింగ్ మరణ వార్త విన్న సినీ ప్రముఖులంతా తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలే కాకుండా అన్ని భాషల పరిశ్రమలకు చెందిన నటీనటులు స్పందిస్తున్నారు. చాలా త్వరగా ఈ లోకాన్ని విడిచి పెట్టి వెళ్లిపోయాడంటూ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్..

సోషల్ మీడియాలో యాక్టివ్..

అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుశాంత్ తన జీవితంలోని 50 కోరికలు, డ్రీమ్స్ లిస్ట్ బయట పెట్టాడు. విమానం నడపడం నేర్చుకోవాలి, ఐరెన్ మ్యాన్‌లా అవ్వాలి.. ఎడమ చేతితో క్రికెట్ ఆడాలి.. మోర్స్ కోడ్ నేర్చుకోవాలి.. అంతరిక్షంగురించి పిల్లలకు చెప్పాలి వంటి జాబితాను తయారు చేసుకున్నాడు.

తీరకుండానే తిరిగిరాని లోకాలకు..

తీరకుండానే తిరిగిరాని లోకాలకు..

కైలాసంలో ధ్యానం, బ్లూ హోల్‌లో డైవ్ చేయడం, ఇస్రో, నాసాలకు పిల్లలను పంపడం, బుక్ రాయడం, డిస్నీ ల్యాండ్‌ను సందర్శించడం, అడవిలో వారం గడపడం, ఆరు నెలల్లో సిక్స్ ప్యాక్, పది రకాల నృత్యాలను నేర్చుకోవడం ఇలా ఎన్నో కోరికలున్నాయని చెప్పుకొచ్చాడు. కానీ వాటిని తీర్చుకోకుండానే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయాడు.

Recommended Video

Sushant Singh Rajput Latest News And His last Instagram Post
పిల్లల కోసం కలలు..

పిల్లల కోసం కలలు..

పిల్లల కోసమే ఎక్కువగా కలలు కన్నాడు సుశాంత్. వారికి డ్యాన్స్ నేర్పించాలని ఆ లిస్ట్‌లో పేర్కొన్నాడు. చాంపియన్‌తో చెస్ ఆడాలని, ఇష్టమైన 50 పాటలను గిటార్‌పై ప్లే చేయాలి, యూరప్ వరకు ట్రెయిన్‌లో ప్రయాణించాలని ఎన్నెన్నో కోరికలను రాసుకొచ్చాడు. కానీ అంతలోపే ఈ అనర్థం జరిగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X