బ్రేకింగ్ : ఉరి వేసుకుని బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ
బాలీవుడ్‌ను మరణ వార్తలు కుదిపేస్తున్నాయి. రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి దిగ్గజ నటులు మృతి చెందిన ఘటనలు మరవకు ముందే మరో యువ తార నేలకూలింది. స్టార్‌గా ఎదుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) ఉరి వేసుకుని మరణించాడు. ఈ ఘటనతో బాలీవుడ్ సినీ లోకం షాక్‌క గురైంది. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు.

వార్తలు వైరల్..
సుశాంత్ ఆదివారం ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ వార్త క్షణాల్లో వైరల్ అయింది. రిప్ సుశాంత్ అంటూ ఆయన ఫ్యాన్స్ కన్నీరు మున్నీరయ్యారు. సోషల్ మీడియా మొత్తం సుశాంత్ వార్తలు, ఫోటోలతో నిండిపోయింది. యంగ్ హీరో మరణంపై నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు.

పలు చిత్రాలతో ఫేమస్..
సుశాంత్ సింగ్ బుల్లితెర, వెండితెరపై రాణించాడు. కాయ్‌పోచే, పీకే, రబ్తా, కేదార్‌నాథ్ లాంటి హిట్ చిత్రాల్లో సుశాంత్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే తెలుగు ప్రేక్షకులకు మాత్రం టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ బయోపిక్ ద్వారా బాగా సుపరిచితుడు.

ప్రేమాయణం..
సుశాంత్ సింగ్ పలువురితో ప్రేమాయణం సాగించాడు. మొదటగా కృతి సనన్‌తో ప్రేమలో మునిగి తేలాడు. ఆ బంధానికి బ్రేకప్ చెప్పిన సుశాంత్.. ప్రస్తుతం రెహా చక్రవర్తితో ప్రేమాయణం నడుపుతున్నాడు. అయితే సుశాంత్ మరణ వార్త మాత్రం బాలీవుడ్‌ను షాక్‌లో ముంచెత్తింది.
Recommended Video

తెలియని కారణాలు..
కెరీర్ సాఫీగా సాగుతున్న ఈ తరుణంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అందరిలోనూ అనుమానాలను రేకెత్తిస్తోంది. ఉరి వేసుకునేంత కష్టం ఎందుకు వచ్చిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆయన మరణం పట్ల అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియడం లేదు.


Click it and Unblock the Notifications











