Don't Miss!
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- News సీఎం జగన్ కొత్త ఎన్నికల నినాదం..డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్‌మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్‌లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సుశాంత్ మరో హీరోయిన్‌తో డేటింగ్.. సీక్రెట్‌ను బయటపెట్టిన బాలీవుడ్ నటి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాంతరం అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అంకితా లోఖండేతో బ్రేకప్ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ కీర్తి సనన్‌తో డేటింగ్ చేశారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ నటి లిజ్జా మాలిక్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సుశాంత్, కృతి సనన్ మధ్య అఫైర్ కొంతకాలం నడించింది. ఆ సమయంలో వారిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు అని తెలిపింది.
సుశాంత్ సింగ్‌తో చాలా కాలంగా నాకు అనుబంధం ఉంది. అతడి మనస్తత్వం నాకు పూర్తిగా తెలుసు. కృతితో ఉన్నప్పుడు చాలా సార్లు హ్యాపీగా ఉండటం చూశాను అని తెలిపారు. రెండేళ్ల క్రితం కృతితో డేటింగ్ చేసిన విషయం నాకు తెలుసు. రెండున్నర ఏళ్ల క్రితం నేను సుశాంత్‌ను కలిశాను. కృతి సనన్ బర్త్ డే సెలబ్రేషన్స్ బాంద్రా క్లబ్లో జరిగితే నేను వెళ్లాను. ఆ సమయంలో సుశాంత్ చాలా హ్యాపీగా కనిపించారు. పార్టీ జరిగినంత సేపు ముఖంపై చిరునవ్వు వెలుగుతూనే ఉంది అని లిజా తెలిపింది.
సుశాంత్ ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకొంటాడు. అందరికి వినోదాన్ని పంచుతూ, జోకులు పేల్చుతూ ఫుల్ ఎనర్జీతో ఉంటారు. ఆ పార్టీలో సుశాంత్, కృతి ఇద్దరు దంపతుల్లా కనిపించారు. కృతి గెస్టులను రిసీవ్ చేసుకొంటూ ఉంటే.. సుశాంత్ డ్రింక్ స్వీకరిస్తూ డ్యాన్సులు వేస్తూ కనిపించార అని లిజ్జా వెల్లడించింది.