కలవాలని ఉంది బ్రదర్.. సుశాంత్ సింగ్ నాకు చేసిన ఆఖరి మెస్సేజ్ ఇదే: అర్జున్ కపూర్ స్క్రీన్ షాట్
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్త ఒక్కసారిగా బాలీవుడ్ ని ఉలిక్కిపడేలా చేసిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక యువ హీరో మరణం తోటి ఇండస్ట్రీ ప్రముఖుల గుండెల్ని కూడా కదిలిస్తోంది. అయితే సుశాంత్ తో ఉన్న అనుబంధం గురించి ప్రతి ఒక్క సెలబ్రెటీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. రీసెంట్ గా అర్జున్ కపూర్ సుశాంత్ చేసిన చాటింగ్ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అందరికి మంచి మిత్రుడు..
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎలాంటి వివాదాల్లోకి వెళ్లలేదు. ఒకరిని నిందించడానికి కూడా అతని మనసు ఒప్పుకోదని సుశాంత్ చాలా మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రస్తుతం సెలబ్రెటీస్ ఎన్నో విషయాలను చెబుతున్నారు. యువ హీరో అర్జున్ కపూర్ కూడా సుశాంత్ కి సంబంధించిన ఒక స్క్రీన్ షాట్ ని బయటపెట్టాడు.

18నెలల క్రితం..
అర్జున్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ లో 18నెలల క్రితం చేసిన ఒక చాటింగ్ స్క్రీన్ షాట్ ని పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో సుశాంత్ తన తల్లిని మిస్ అవుతున్నట్లు పోస్ట్ చేయడంతో అర్జున్ అతనికి ధైర్యం చెప్పాడు. అదే తనతో చివరగా సుశాంత్ చేసిన చాటింగ్ అంటూ అర్జున్ కపూర్ పోస్ట్ చేయడం వైరల్ గా మారింది.

కలవాలని ఉంది బ్రదర్..
కేదర్ నాథ్ సినిమా రిలీజ్ అయినప్పుడు అర్జున్ కపూర్ విషెస్ అందిస్తూ.. మీ అమ్మ ఎక్కడ ఉన్నా కూడా సంతోషంతో గర్వపడుతుంది అని అర్జున్ చెప్పగా.. అందుకు సుశాంత్ కూడా నిన్ను ఒకసారి కలవాలని ఉంది బ్రదర్ అని మెస్సేజ్ చేశాడు. అంతే కాకుండా మనం ఎప్పుడు కలుద్దామో ఒకసారి చెప్పు అని కూడా అందులో సుశాంత్ పేర్కొన్నాడు.
Recommended Video

అర్జున్ ఎమోషనల్ కామెంట్స్..
సుశాంత్ తనతో చాట్ చేసిన విధానాన్ని తలచుకొని అర్జున్ కపూర్ చాలా ఎమోషనల్ గా కామెంట్ చేశారు. అతను ఎందుకు ఇలాంటి పని చేశాడో తనకు ఏ మాత్రం అర్థం కావడం లేదని తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు అర్జున్ కపూర్ వివరణ ఇచ్చాడు. అర్జున్ తో పాటు చాలా మంది సినీ తారలు సుశాంత్ సింగ్ తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మనోవేదనకు లోనవుతున్నట్ల ట్వీట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











