Sushant Singh Rajput ను అలా తొక్కేశారు! .. చేజారిన టాప్ సినిమాలు ఇవే..
బాలీవుడ్‌లో ఎలాంటి అండ లేకుండా స్టార్ హీరోగా ఎదిగిన వారిలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత టెలివిజన్ నటుడిగా అనంతరం బాలీవుడ్‌లో హీరోగా తన ప్రయాణాన్ని సాగించారు. అయితే స్టార్ స్టేటస్‌తో దూసుకెళ్తున్న సుశాంత్ ఆకస్మికంగా మరణించడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అయితే సుశాంత్‌ను కొందరు బాలీవుడ్ ప్రముఖులు మానసిక క్షోభకు గురిచేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే...
Recommended Video

సుశాంత్‌పై కుట్రలు అంటూ..
స్వయంకృషితో పైకి వస్తున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను తొక్కేసేందుకు బాలీవుడ్‌లోని కొన్ని బడా సంస్థలు కుట్ర పన్నాయనే ఆరోపణలు తీవ్రస్థాయిలో వచ్చాయి. అందుకు తగినట్టే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. సుశాంత్ అవకాశాలను, ఆఫర్లను దెబ్బ తీయాలనే కుట్ర పన్నారనే వార్తలు మీడియాలో విస్తృతంగా ప్రచారం అయ్యాయి. సుశాంత్ మరణానికి ప్రేరేపించారంటూ బాలీవుడ్ దిగ్గజాలను, సంస్థలను ముంబై పోలీసులు విచారించడం తెలిసిందే.

సుశాంత్‌కు మానసిక క్షోభ
బాలీవుడ్‌లో ఆఫర్లు వచ్చినట్టే వచ్చి చేజారడంపై సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఓ దశలో మానసిక క్షోభను అనుభవించాడు. ఇండస్ట్రీలో ఒంటరిగా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. అలాంటి వాటిని తట్టుకోలేక పలుమార్లు దు:ఖంలో మునిగిపోయారు అంటూ కథనాలు వెలువడ్డాయి.

చేజారిన బాజీరావు మస్తానీ?
బాలీవుడ్‌లో వచ్చిన కథనాల ప్రకారం.. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన బాజీరావు మస్తానీ మూవీ ఆఫర్ తొలుత సుశాంత్ సింగ్‌కు వచ్చింది. కానీ చివరి నిమిషంలో రణ్‌వీర్ సింగ్ తెరపైకి వచ్చారు. సుశాంత్ ఆ సినిమా చేసి ఉంటే ఆయన స్టార్ హోదా మరో రేంజ్‌లో ఉండేది అంటూ సన్నిహితులు అభిప్రాయపడ్డారు.

సుశాంత్‌కు బదులు ఆదిత్య రాయ్ కపూర్
అలాగే సుశాంత్ సింగ్‌తో కాయ్ పో చే తీసిన అభిషేక్ కపూర్ ఆ తర్వాత ఫితూర్ అనే సినిమాను తెరకెక్కించాలని అనుకొన్నాడు. అయితే ఆ తర్వాత అతడిని తొలగించి ఆదిత్య రాయ్ కపూర్‌ను తీసుకొన్నాడు. దాంతో సుశాంత్‌కు షాక్ తగిలినంద పనైంది. కానీ ఆయన మనోనిబ్బరం చేసుకొన్నాడు అని స్నేహితులు వెల్లడించడం తెలిసిందే.

సుశాంత్‌కు భన్సాలీ డబుల్ స్ట్రోక్
సుశాంత్ సింగ్ కేరీర్‌లో అందినట్టే అంది.. చేజారిన సినిమాలో రామ్ లీలా చిత్రం మరోటి. సంజయ్ లీలా భన్సాలీ మొదట హీరోగా సుశాంత్‌ని అనుకొన్నారు. చివరకు రణ్‌వీర్ సింగ్, దీపిక పదుకోన్‌తో సినిమాను భన్సాలీ తెరక్కించారు. ఈ సినిమా చేజారడం కూడా సుశాంత్‌కు గట్టి దెబ్బ తగలింది. ఆ తర్వాత ఆ చిత్రాన్ని అర్జున్ కపూర్‌తో తెరకెక్కించారు. అలాగే రోమియో అక్బర్ వాల్టర్ చిత్రం కూడా సుశాంత్ చేయాల్సిందే. కానీ చివర్లో జాన్ అబ్రహంతో సినిమాను రోబీ గ్రేవాల్, బంటీవాలియా తెరకెక్కించారు.


Click it and Unblock the Notifications











