షాకింగ్: దిల్ బేచారా పుల్ మూవీ లీక్.. రిలీజైన కొద్దిగంటల్లోనే తమిళ్ రాకర్స్ పంజా
బాలీవుడ్ హీరో, దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం దిల్ బేచారా చిత్రం జూలై 24 రాత్రి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డిస్నీ+హాట్ స్టార్‌లో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఇప్పటికే ఈ సినిమా గురించి వార్తలు వైరల్‌గా మారాయి. చాలా మంది అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు. అయితే అలాంటి భావోద్వేగమైన సినిమాపై పైరసీ వెబ్‌సైట్ పంజా విసిరింది. వివరాల్లోకి వెళితే..

దిల్ బేచారాతో దర్శకుడిగా పరిచయం
గతంలో బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు ముఖేష్ చాబ్రా దిల్ బేచారా సినిమాతో దర్శకుడిగా మారారు. సుశాంత్ సింగ్‌కు స్నేహితుడనే విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రాన్ని హలీవుడ్‌లో ప్రశంసలు పొందిన ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్ ఆధారంగా తెరెక్కించారు. సుశాంత్ బతికి ఉన్న సినిమాలో థియేటర్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సినిమాను విడుదల చేయలేకపోయారు.

సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో
ఇలా సినిమా రిలీజ్ ఆగిపోవడం, ఎవరూ ఊహించని విధంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్‌నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇప్పటి సుశాంత్ మరణం నుంచి తేరుకోలేని పరిస్థితి దేశవ్యాప్తంగా కనిపిస్తున్నది. ప్రస్తుతం ఆయన మరణంపై సిబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ లేవనెత్తుతున్నారు.

భావోద్వేగ పరిస్థితుల్లో
ఇలాంటి భావోద్వేగ పరిస్థితుల్లో దిల్ బేచారా సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించారు. సుశాంత్‌కు నివాళి అర్పించేందుకు అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఉచితంగా సినిమాను చూపించాలని ప్రయత్నం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో జూలై 24వ తేదీన డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజైంది. అయితే సినిమా రిలీజైన కొద్ది సేపట్లోనే తమిళ రాకర్స్ పైరసీకి పాల్పడింది.
Recommended Video

హెచ్‌డీ క్వాలిటీ సినిమాను లీక్ చేసి
దిల్ బేచారా సినిమాను తమిళ రాకర్స్ కొద్ది గంటల్లోనే లీక్ చేసి షాకిచ్చింది. పూర్తి నిడివి సబ్ టైటిల్స్‌తో ఉన్న సినిమాను వెబ్‌సైట్లో పెట్టింది. దాంతో సినిమా యూనిట్ షాక్ గురైంది. అయితే అన్ని సినిమాలను కాకుండా ఇలాంటి సినిమాను కూడా పైరసీ చేయడం భావ్యం కాదు అనే వాదన ప్రేక్షకుల్లో, అభిమానుల్లో వినిపిస్తున్నది. ఫుల్ హెచ్‌డీ క్వాలిటీని తమ సైట్లో అందుబాటులోకి తెచ్చారు.


Click it and Unblock the Notifications











