Sushant Singh Rajput ఫ్యామిలీలో తీవ్ర విషాదం.. ప్రమాదంలో ఐదుగురు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం

బాలీవుడ్ నటుడు, స్వర్గీయ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది. రోడ్డు ప్రమాదంలో ఆయన కుటుంబానికి సంబంధించిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. దాంతో వారి ఫ్యామిలీలో విషాదఛాయలు అలుముకొన్నాయి. ఈ దారుణ దుర్ఘటనతో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సన్నిహితులు, స్నేహితులు దిగ్బ్రాంతికి గురయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

నేషనల్ హైవే 333పై ప్రమాదం

నేషనల్ హైవే 333పై ప్రమాదం

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు చెందిన ఏడుగురు కుటుంబ సభ్యులు వాహనంలో ప్రయాణిస్తున్నారు. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలోని నేషనల్ హైవే 333పై మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో వారు ప్రయాణిస్తున్న వాహనం ట్రక్కును ఢీకొట్టింది. దాంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

ఐదుగురు మృతి, ఇద్దరికి గాయాలు

ఐదుగురు మృతి, ఇద్దరికి గాయాలు

దారుణ రోడ్డు ప్రమాదం గురించి బీహార్ పోలీసులు వెల్లడిస్తూ.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యులు ప్రయాణిస్తూ వాహనం షీక్‌పురా, సికందరా రోడ్డులోని పిప్రా గ్రామంలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని పాట్నా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బల్మ్‌కుంద్ సింగ్, దిల్ కుష్ సింగ్ పరిస్థితి విషమంగా ఉంది అని చెపపారు.

అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా..

అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా..

వాహనంలో ప్రయాణిస్తున్న వారంతా హర్యానా సీనియర్ పోలీస్ ఆఫీసర్ ఓపీ సింగ్ సోదరి గీతా దేవీ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత వారంతా పాట్నాకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది అని పోలీసులు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఓపీ సింగ్ బావ అనే విషయం తెలిసిందే.

దుర్ఘటనపై కేసు నమోదు.. డ్రైవర్ పరారీ..

దుర్ఘటనపై కేసు నమోదు.. డ్రైవర్ పరారీ..


సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబ సభ్యుల రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దుర్ఘటనపై దర్యాప్తు చేస్తున్నాం. యాక్సిండెట్ కాగానే ట్రక్కు డ్రైవర్, అతడి సహాయకుడు పరార్ అయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టాం. ట్రక్కు డ్రైవర్‌పై కేసు నమోదు చేశాం అని బీహార్ పోలీసులు తెలిపారు.

Recommended Video

VJ Sunny కి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి బెదిరింపులు Madhavi Latha ఫైర్| Rowdy Rohini| Filmibeat Telugu
మృతుల్లో ఇద్దరు మహిళలు

మృతుల్లో ఇద్దరు మహిళలు

రోడ్డు ప్రమాద తీవ్రతకు సుశాంత్ సింగ్ బంధువులు ప్రయాణిస్తున్న వాహనం నుజ్జునుజ్జు అయింది. ఐరన్ కట్టర్స్ తీసుకువచ్చి మృతదేహాలను బయటకు తీశాం. గాయపడిన వారిలోని పాట్నాలోని సర్దార్ హాస్పిటల్‌లో చికిత్స అందిస్తున్నాం. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు అని హల్సీ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ వివేక్ కుమార్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X