For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నరేంద్ర మోదీకి షాకిచ్చిన సుశాంత్ సింగ్.. ఫస్ట్‌టైం ప్రధాని రెండోస్థానం.. మూడోస్థానంలో రియా!

    |

    బాలీవుడ్ హీరో, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన మరణించడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సినీ అభిమానులను విషాదంలోకి నెట్టింది. అయితే సుశాంత్‌ తన మరణం తర్వాత అరుదైన రికార్డును సొంతం చేసుకొన్నాడు. యాహూ ఇండియా సర్చ్ ఇంజిన్ రిలీజ్ చేసిన గణాంకాల్లో సుశాంత్ అత్యధికంగా సర్చ్ చేసిన సెలబ్రిటీగా ఓ ఘనతను సొంతం చేసుకొన్నారు. ఆ డేటా వివరాల్లోకి వెళితే..

    యాహూ జాబితాలో టాప్‌గా సుశాంత్ సింగ్

    యాహూ జాబితాలో టాప్‌గా సుశాంత్ సింగ్

    యాహూ 2020 ఇయర్ ఇన్ రివ్యూ అనే కార్యక్రమంలో భాగంగా 2020లో నెటిజన్లు అత్యధికంగా సర్చ్ చేసిన న్యూస్ మేకర్స్ వివరాలను వెల్లడించింది. ఈ జాబితాలో మోస్ట్ సర్చ్‌డ్ పర్సనాలిటీగా స్థానాన్ని సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సొంతం చేసుకొన్నారు. ఈ జాబితాలో ఎక్కువ మంది రాజకీయ నేతలు ఉండటం విశేషంగా మారింది.

    నరేంద్రమోదీని వెనుకకు నెట్టిన సుశాంత్

    నరేంద్రమోదీని వెనుకకు నెట్టిన సుశాంత్

    అయితే యాహూ జాబితాలో ప్రధాని నరేంద్రమోదీని సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ వెనుకకు నెట్టారు. 2017 నుంచి తొలి స్థానంలో నిలుస్తున్న ప్రధాని మోదీ 2020లో రెండోస్థానంతో సరిపెట్టుకొన్నారు. ఈ జాబితాలో రాహుల్ గాంధీ, అమిత్ షా, ఉద్దవ్ థాక్రే, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ లాంటి ప్రముఖులు ఉన్నారు.

    మూడో స్థానంలో రియా చక్రవర్తి

    మూడో స్థానంలో రియా చక్రవర్తి

    యాహూ ప్రకటించిన జాబితాలో సుశాంత్ సింగ్, ప్రధాని మోదీ తర్వాత రియా చక్రవర్తి మూడోస్థానంలో నిలిచింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన రియా కోసం నెటిజన్లు భారీగా ఇంటర్నెట్‌లో శోధించినట్టు స్పష్టమైంది. ఈ జాబితాలో కంగన రనౌత్, అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు.

    బాలీవుడ్‌ సెలబ్రిటీలలో సుశాంత్ మొదటి స్థానం

    బాలీవుడ్‌ సెలబ్రిటీలలో సుశాంత్ మొదటి స్థానం

    మోస్ట్ సర్చ్‌డ్ మేల్ (పురుషుల) సెలబ్రిటీ క్యాటగిరిలో సుశాంత్ మొదటి స్థానంలో నిలిచారు. బాలీవుడ్ హీరోల్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌కు స్థానం లభించింది. ఇక కరోనా సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచిన సోనుసూద్ హీరో ఆఫ్ ది ఇయర్‌గా నిలిచారు.

    Kriti Sanon To Play Sita In Prabhas Starrer Adipurush?
    సెలబ్రిటీ క్యాటగిరిలో రియా

    సెలబ్రిటీ క్యాటగిరిలో రియా

    మోస్ట్ సర్చ్‌డ్ ఫిమేల్ (మహిళల) సెలబ్రిటీ క్యాటగిరిలో రియా చక్రవర్తి తొలి స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో కంగన రనౌత్, దీపిక పదుకోన్, సన్నీలియోన్, ప్రియాంక చోప్రా పేర్లు కనిపించాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి వివాదాస్పద సెలబ్రిటీగా మారారు. డ్రగ్స్ కేసులో ఆమె జైలుకు వెళ్లడంతో మరింత పాపులారిటీని సంపాదించింది. ఈ క్రమంలో ఆమె గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ప్రయత్నించారనే విషయం ఈ విధంగా స్పష్టమైంది.

    English summary
    Bollywood actor, Late Sushant Singh Rajput was the most searched personality of 2020 while his girlfriend, actress Rhea Chakraborty, was the most searched female celebrity. According to Yahoo's 2020 Year in Review (YIR), Sushant Singh, Narendra modi, Rhea was in top positions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X