సుశాంత్ సింగ్ ఎవరని ప్రశ్నించిన మీరా చోప్రా.. క్లారిటీ ఇచ్చినా నెటిజన్స్ ఫైర్

మీరా చోప్రా వ్యవహారం సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా మీరా చోప్రా పేరు వార్తల్లో మార్మోగిపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన రచ్చకు మీరా చోప్రా విసిగిపోయింది. దీంతో జాతీయ మహిళా కమిషన్‌కు, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేసింది. అంతకు ముందు మీరా చోప్రా పేరు తెలుగు నాట అంతగా పరిచయం లేకపోయినా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ పుణ్యమా అని మళ్లీ వెలుగులోకి వచ్చింది. అక్కడితో అంతా బాగుంది అనుకుంటే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై మరో సంచలన వ్యాఖ్య చేసింది. అసలింతకీ ఏం జరిగిందో ఓ సార చూద్దాం.

సుశాంత్ మరణ వార్త..

సుశాంత్ మరణ వార్త..

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం (జూన్ 14) ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఈ వార్తలు దావానంలా వ్యాప్తి చెందాయి. అయినా కొందరు మొదట నమ్మలేదు. ప్రముఖ మీడియా సంస్థలు ప్రచురించడంతో అందరికీ పరిస్థితి అర్థమైంది. అయితే ఇదే విషయాన్ని ఓ నెటిజన్ మీరా చోప్రాను అడిగాడు.

అతను ఎవరు?

అతను ఎవరు?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారా? అని ఓ నెటిజన్ మీరా చోప్రాను అడిగాడు. అతను ఎవరు? అని మీరా చోప్రా సమాధానం ఇచ్చింది. దీంతో ఆ ట్వీట్ తెగ వైరల్ అయింది.అప్పటికే ట్వీట్ డిలీట్ చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తరువాత కొద్ది సేపటికి.. సుశాంత్ లేరా? చనిపోయారా? ఇది నిజమా? కానీ ఎలా అంటూ ట్వీట్లు చేసింది.

ఆడుకుంటున్న నెటిజన్స్..

ఆడుకుంటున్న నెటిజన్స్..

అటెన్షన్ కోరుకుంటోందని అందకు ఇలాంటి కామెంట్స్ చేస్తోందని మీరాచోప్రాపై తెగ ఫైర్ అవుతున్నారు. బాలీవుడ్‌లో ఉంటూ సుశాంత్ తెలియకపోవడం విడ్డూరమని కావాలని సెన్సేషన్ కోసం అలా చేస్తోందని నెటిజన్స్ తీవ్ర పదజాలంతో విరుచుకపడుతున్నారు.

Recommended Video

Madhavi Latha Reacts On Sushant's సూసైడ్ And How The Depression ఎఫెక్ట్స్
మీరా చోప్రా వివరణ..

మీరా చోప్రా వివరణ..

తనపై నెటిజన్స్ ఫైర్ అవుతుండటంతో మీరా చోప్రా వివరణ ఇచ్చుకుంది. ‘మీరు మూర్ఖులు ఎప్పటికీ అర్థం చేసుకోరు.. మనకు తెలిసిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎలాంటి స్థితిలో ఉంటామో తెలుసా? ఒకరి చావు మీద ద్వేషాన్ని చూపకండి..వెళ్లండి వెళ్లి మీ జీవితం ఏంటో అది చూసుకోండ'ని తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X