త్వరలోనే సంగీత ప్రపంచంలో చావులు.. మ్యూజిక్ ఇండస్ట్రీలోనే మాఫియా ఎక్కువ.. బాలీవుడ్ సింగర్ కామెంట్స్
సుశాంత్ సింగ్ మరణం ఎన్నో అనుమానాలకు మరెన్నో చర్చలకు దారి తీస్తోంది. ఇప్పటి వరకు ఉన్న బంధుప్రీతిని, మాఫియాను ఎవ్వరూ అంతగా వేలెత్తి చూపకపోయినా.. సుశాంత్ ఆత్మహత్య అనంతరం ప్రతి ఒక్కరూ బాలీవుడ్‌ను ధూషిస్తున్నారు. ప్రతీ ఒక్కరూ సుశాంత్ మరణానికి కారణం బాలీవుడ్ వ్యవహార శైలియే అని, అందులో మరీ ముఖ్యంగా కరణ్ జోహర్ వంటి పెద్దల ఆధిపత్యం కారణంగానే సుశాంత్ ప్రాణాలు వదిలి పెట్టాల్సి వచ్చిందని ఫ్యాన్స్, నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

సుశాంత్ మృతి..
హీరో సుశాంత్ సింగ్ ఆదివారం ఉదయం బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా డిప్రెషన్‌కు లోనైన సుశాంత్ ఇలా చివరకు తన చనువు చాలించాడు. సుశాంత్ మృతి పట్ల సెలెబ్రిటీలు, ఫ్యాన్స్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు..

బాలీవుడ్‌పై ఫైర్..
సుశాంత్ ఆత్మహత్యపై సోషల్ మీడియాలో ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. కరణ్ జోహర్, కపూర్ ఫ్యామిలీ, ఖాన్ ఆధిపత్యమే సుశాంత్ మరణానికి కారణమని నెటిజన్లు ఆరోపించారు. ఈ మేరకు కరణ్ జోహర్, అలియా భట్, సల్మాన్ ఖాన్‌ను విపరీతంగా ట్రోల్స్ చేశారు. కొందరు సెలెబ్రిటీలు సైతం బాలీవుడ్ తీరును తప్పుబట్టారు.

త్వరలోనే సంగీత ప్రపంచంలో చావులు..
సుశాంత్ ఆత్మహత్యపై స్పందించిన బాలీవుడ్ ప్రముఖ సింగర్ సోను నిగమ్ సంచలన కామెంట్స్ చేశాడు. ‘త్వరలోనే సంగీత ప్రపంచలోని చావుల గురించి మీరు వింటారు' అని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Recommended Video

మ్యూజిక్ ఇండస్ట్రీలోనే మాఫియా ఎక్కువగా..
సినీ ప్రపంచంలో కంటే సంగీత పరిశ్రమలోనే మాఫియా ఎక్కువగా ఉంటుందని, కేవలం రెండు కంపెనీలే గుత్తాధిపత్యాన్ని చాటుతున్నాయని చెప్పుకొచ్చాడు. ఎవరు పాడాలి? ఎవరు కంపోజ్ చేయాలి? ఎవరు రాయాలి? ఇలా ప్రతీ ఒక్కటి వారే నిర్ణయిస్తారని పేర్కొన్నాడు. రేపు ఓ సింగర్ లేదా మ్యూజిక్ డైరెక్టర్ లేదా లిరిక్ రైటర్ ఇలా ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకోవచ్చని సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.


Click it and Unblock the Notifications











