పూరీ మార్కు...( ‘అడ్డా’ ప్రివ్యూ)

By Srikanya

హైదరాబాద్ : దర్శకుడు పూరీ జగన్నాధ్ శిష్యుడు కనుక ఆయన మార్క్ తప్పక ఉంటుందని, ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని, పూర్తి కాన్ఫిడెన్స్‌తోనే ఈ చిత్రం విజయవంతవౌతుందని నమ్ముతున్నామని హీరో సుశాంత్ తెలిపారు. శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.కార్తీక్‌రెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించిన 'అడ్డా' చిత్రం ఈ రోజు విడుదల కానుంది.

సుశాంత్ మాట్లాడుతూ- 'ఏహీ హై మేరీ అడ్డా' పాట ఈ చిత్రానికి ఊపును, ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తుందని, దాదాపు రెండు సంవత్సరాలపాటు ఈ చిత్రం కోసం మరే చిత్రాన్ని ఒప్పుకోకుండా ప్రయాణించామని, కథ రాసుకోవడానికే ఏడెనిమిది నెలలు పట్టిందని తెలిపారు. సినిమాపరంగా గ్యాప్ వచ్చినమాట నిజమేనని, వెయిట్‌చేసినందుకు బాధగా లేదని, ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడం ఆనందంగా ఉందని, అది ఈ చిత్రంతో తీరిపోతుందని అన్నారు.

ఎలాంటి కథలో తాను నప్పుతాను అని ప్రేక్షకులు అనుకుంటే, అలాంటి కథ తనను స్పందింపచేస్తే తప్పక ఆ చిత్రంలో నటిస్తానని, మంచి కథలు తరువాత కుదురుతాయన్న నమ్మకం కూడా లేకపోవడంతో ఈ కథలో పూర్తి ఇన్‌వాల్వ్ అయి నటించానని తెలిపారు. తన కెరీర్‌లో ఇప్పటివరకూ విపరీతంగా నచ్చిన సినిమా కథ అంటూ రాలేదని, అందుకే అడ్డాను ఓ రకంగా పూర్తి ఆకలితో చేశానని, ఈ చిత్రంలో హీరో చేసే పని, హీరోయిన్ అతనితో కలిసే విధానం సమాజానికి హీరోకు మంచి చేసే పద్ధతులు, సోషల్ ఎలిమెంట్స్‌వంటి అన్ని షేడ్స్ చిత్రంలో ఉన్నాయని, యూనివర్సల్ స్టోరీగా చిత్రం విడుదలయ్యాక అందరూ చెబుతారని ఆయన వివరించారు. పూరీ మార్కు డైలాగులు ఈ చిత్రంలో ఉంటాయని, బైటి చిత్రాలలో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని, అయితే అడ్డా విడుదలై తనకు ఓ మంచి ఇమేజి వచ్చినాక తప్పక చేస్తానన్నారు.

నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ' అడ్డా చిత్రం ఆగస్టు 15న వరల్డ్ వైజ్ రిలీజ్ చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా అద్భుతంగా వచ్చింది. సుశాంత్‌కి, మా బేనర్‌కి 'అడ్డా' బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది' అన్నారు. ఇటీవల రిలీజైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. ఈ చిత్రానికి బిజినెస్ పరంగా మంచి క్రేజ్ వచ్చింది. బయ్యర్స్ అందరూ మంచి ఆఫర్స్ తో తీసుకున్నారు. తప్పకుండా మా బేనర్లో సూపర్ హిట్ అవుతుంది' అన్నారు.

బ్యానర్ : శ్రీనాగ్ కార్పొరేషన్
నటీనటులు :సుశాంత్ ,శాన్వి , కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తాగుబోతు రమేష్, నల్లవేణు, ధన్ రాజ్, స్వప్నిక తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్,
సినిమాటోగ్రఫీ : ఎస్.అరుణ్ కుమార్,
ఎడిటింగ్ : గౌతం రాజు,
ఫైట్స్ : కనల్ కణ్ణన్,
ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.వి.ఎస్.వాసు,
కోడైరెక్టర్ : డి. సాయికృష్ణ, పి.శ్రీను,
నిర్మాతలు : చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల,
కథ-స్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : జి.కార్తీక్ రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X