సుశాంత్ కొత్త చిత్రం ‘అడ్డా’కాన్సెప్టు
హీరో సుశాంత్ మాట్లాడుతూ...ప్రేమ పేరు చెబితే అటు పెద్దవాళ్లలోనూ ఇటు యువతలోనూ చిన్నపాటి గందరగోళం ఉంటుంది. అందుకు కారణాలను వినోదాత్మకంగా మా చిత్రంలో చూపిస్తున్నాము. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా పాజిటివ్ థాట్‌తో ఉంటుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ..''నేటితరం సరైన భాగస్వామిని ఎంపిక చేసుకొంటోందా? లేదా? అనే కోణంలో సాగే కథ ఇది. నవంబరు నెలాఖరులోపు చిత్రీకరణ పూర్తవుతుంద''అని వివరించారు.
జి.సాయి కార్తీక్ దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రఘుబాబు, కోట శ్రీనివాసరావు, తాగుబోతు రమేష్, ధన్‌రాజ్, తనికెళ్ల భరణి, వేణుమాధవ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్‌కుమార్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.సాయికార్తీక్.


Click it and Unblock the Notifications












