సుశాంత్ ‘అడ్డా’ ప్రారంభం
గతంలో కాళిదాసు, కరెంట్ చిత్రాలు చేసిన అక్కినేని మనవడు సుశాంత్ మూడో చిత్రం 'అడ్డా' షూటింగ్ ప్రారంభోత్సవం శనివారం అన్నపూర్ణ స్టూడియో ఘనంగా జరిగింది. తొలి సన్నివేశానికి నాగార్జున క్లాప్ కొట్టగా, నాగేశ్వరరావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. పూరి జగన్నాథ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అడ్డా చిత్రానికి జి.సాయి కార్తీక్ దర్శకత్వం వహిస్తుండగా శ్రీనాగ్ కార్పొరేషన్ బ్యానర్ పై చింతలపూడి శ్రీనివాసరావు, నాగ సుశీలలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సుశాంత్ సరసన లవ్ లీ ఫేం శాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసులో జరిగే ప్రేమ కథ ఇది. ప్రస్తుతం ప్రేమ కథలకు పాజిటివ్ యాంగిల్ లో ఉంటుందన్నారు. నిన్నే పెళ్లాడతా మాదిరి కుటుంబం మొత్తం చూసి ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని చెప్పారు.
సుశాంత్ మాట్లాడుతూ...నేను ఎలాంటి కథను కోరుకున్నానో సాయి అలాంటి కథ చెప్పారు. ఈచిత్రం తనకు మంచి గుర్తింపు తెస్తుందనే నమ్మకం ఉందన్నారు. లవ్ లీ చిత్రం తర్వాత తనకు మంచి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందనే నమ్మకం వ్యక్తం చేసింది హీరోయిన్ శాన్వి. ఈ చిత్రాన్ని నవంబర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిర్మాత నాగ సుశీల వెల్లడించారు.
రఘుబాబు, కోట శ్రీనివాసరావు, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి కెమెరా: అరుణ్ కుమార్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: చింతలపూడి ఎనివాసరావు, నాగ సుశీల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి. సాయి కార్తీక్.


Click it and Unblock the Notifications











