twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆగస్టు 15న విడుదలవుతున్న సుశాంత్ ‘అడ్డా’

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : ఓ వైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది', మరో వైపు 'ఎవడు' సినిమా.....ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో చాలా సినిమాలు విడుదలకు సాహసం చేయలేదు. థియేటర్ల సమస్య కూడా ఇందుకు ఓ కారణం. అయితే సమైక్య ఉద్యమం కారణంగా ఆ రెండు సినిమాలు విడుదల నిలిచిపోవడంతో చాలా సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి.

    అలాంటి సినిమాల్లో ఒకటి సుశాంత్ హీరోగా రూపొందిన 'అడ్డా'. ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరుక ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు మొదలు పెట్టారు.

    సుశాంత్ గతంలో కాళిదాసు, కరెంట్ చిత్రాల్లో నటించాడు. అయితే స్టార్ హీరోగా నిలదొక్కుకోలేక పోయాడు. తాజాగా ఆయన నటించని 'అడ్డా' చిత్రం శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.కార్తీకరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మించారు. సుశాంత్ సరసన శాన్వి హీరోయిన్.

    కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తాగుబోతు రమేష్, నల్లవేణు, ధన్ రాజ్, స్విప్నిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : ఎస్.అరుణ్ కుమార్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫైట్స్ : కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.వి.ఎస్.వాసు, కోడైరెక్టర్ : డి. సాయికృష్ణ, పి.శ్రీను, నిర్మాతలు : చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : జి.కార్తీక్ రెడ్డి.

    English summary
    The postponement of Yevadu and Attarintiki Daredi has come as a boon for Small cinemas. Theatres are available and there is no competition at the box-office. Glancing this opportunity some films are getting ready for release. The moment Attarintiki Daredi got postponed, it paved way for Sushanth's Adda release. The film will be released on August 15th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X