సుశాంత్ కొత్త చిత్రం 'అడ్డా'.. డిటేల్స్

By Srikanya

నాగార్జున మేనల్లుడు సుశాంత్ హీరోగా మరో చిత్రం త్వరలో మొదలవ్వనుందని సమాచారం. పూరీ జగన్నాధ్ వద్ద అశోశియేట్ గా పనిచేసిన సాయి రెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. నాగ సుశీల,చింతలపూరి శ్రీనివాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నట్లు సమాచారం. మే నెల నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇక ఈ చిత్రానికి టైటిల్ అడ్డా అని పెట్టారు. ట్యాగ్ లైన్ గా ప్లేస్ ఫర్ లవ్ అన్నారు. హీరోయిన్ ఇంకా ఫైనలైజ్ కాని ఈ చిత్రం సుశాంత్ కి కరెక్టు యాప్ట్ సబ్జెక్టు అని చెప్తున్నారు. సుశాంత్ గతంలో తమ బ్యానర్ లోనే కరెంట్,కాళిదాసు చిత్రాలు చేసారు. కానీ అవేమీ ఆడలేదు. దాంతో గ్యాప్ తీసుకుని ఈ సబ్జెక్టు చేస్తున్నారు. ఆ మధ్యన ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో చిత్రం అనుకున్నారు. బడ్జెట్ ఎక్కువ కావటంతో అది మెటిరియలైజ్ కాలేదు.

ఇక ఈ కొత్త చిత్రం స్క్రిప్టు నిమిత్తం గత సంవత్సరకాలంగా సిట్టింగ్స్ జరుపుతున్నట్లు చెప్తున్నారు. యూత్ ని అడ్డా అనే టైటిల్ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల ఈ చిత్రంపై బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. 'సుశాంత్ చేసిన రెండు సినిమాల్లో మంచి పెర్ ఫార్మర్ గా పేరు వచ్చింది. మేం స్టార్ట్ చెయ్యబోతున్న ఈ మూడో చిత్రం ద్వారా తప్పకుండా సుశాంత్ మరోసారి అందరి ప్రసంసలు అందుకుంటాడు. మా బ్యానర్ లో ఇది మరో మంచి సినిమా అవుతుందంటూ నమ్మకం వ్యక్తం చేసారు.

కాళిదాసు, కరెంట్ అనే రెండు డిజాస్టర్ చిత్రాలు చేసిన సుశాంత్.. ఆ మధ్యన పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్ గురించి మాట్లాడుతూ... అభిమానులను సంతృప్తిపరిచే అవకాశం నాకు దొరికింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచను. మంచి విజయం లభించాక ఇతర సంస్థల్లో నటిస్తాను అన్నారు. ఈ చిత్రానికి నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల, కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం:సాయి రెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X