కన్ఫర్మ్: త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్‌తో పాటు మరో హీరో

గతేడాది భారీ అంచనాల నడుమ 'నా పేరు సూర్య' సినిమా రావడం, అది కాస్తా బాక్సాఫీస్ వద్ద డీలా పడటంతో కాస్త స్లో అయిన అల్లు అర్జున్.. ఈ ఏడాది ఏకంగా మూడు సినిమాలతో హంగామా చేయబోతున్నాడు. ఈ మూడు కథల్లో కూడా విలక్షణత ఉంటుందని, బన్నీ డిఫెరెంట్ యాగిల్ చూస్తామని ప్రచారం జరుగుతోంది. కాగా ఆ మూడింటిలో ప్రత్యేకమైన సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అనే చెప్పుకోవాలి. ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డిఫెరెంట్ యాంగిల్స్‌లో సినిమాలు తీయడంలో దిట్ట. ఇక ఆయన సినిమాల్లో డైలాగ్స్ గురించి చెప్పతరమా! దీంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది.

అయితే ఆ హైప్ రెట్టింపయ్యేలా తాజాగా ఓ హీరో.. తాను కూడా బన్నీ- త్రివిక్రమ్ ప్రాజెక్టులో నటిస్తున్నానని ట్వీట్ చేయడం టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగార్జున మేన‌ల్లుడు, యంగ్ హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. ఈ విషయాన్ని సుశాంత్‌ స్వయంగా ట్విటర్ వేదికగా ప్రకటించాడు. AA19కి సంబంధించి నా ఫస్ట్ అప్‌డేట్ అని పేర్కొంటూ.. ''అల్లు అర్జున్ 19వ సినిమా సెట్స్‌లో ఇదే నాకు మొద‌టి రోజు.

Sushanth Confirmed in Allu Arjun- Trivikram Project

నాకెంతో ఇష్టమైన దర్శకుల్లో ఒకరైన త్రివిక్రమ్‌, అలాగే 'ఆర్య' సినిమా టైమ్ నుంచే నేనెంతో అభిమానిస్తున్న బన్నీ, సీనియ‌ర్ హీరోయిన్ టబు, నా స్నేహితురాలు పూజా హెగ్డే, పీఎస్‌ వినోద్‌, తమన్ వంటి వారితో కలిసి ఈ సినిమాలో పనిచేస్తుండ‌డం చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు చిత్ర యూనిట్‌కి ధన్యవాదాలు. 'చిలసౌ' తర్వాత నేను చేస్తున్న‌ ఈ సినిమా నాకు మరో సాహసం లాంటిది. ఈ చిత్రబృందం నుంచి నేనెంతో నేర్చుకోగలనని న‌మ్ముతున్నా'' అని ట్వీట్ లో వెల్లడించాడు సుశాంత్.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌, గీతా ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ సినిమాలో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నుండటం ఆసక్తికర అంశం. ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇటీవలే రెండో షెడ్యూల్ షూటింగ్ లోకి అడుగు పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X