నాగార్జున మేనల్లుడు ముద్ర నుంచి ఈ సారైనా....
నాగార్జున సోదరి కుమారుడు సుశాంత్ కెరీర్ ప్రారంభించి కాళిదాసు,కరెంట్ అనే చిత్రాలు చేసినా పెద్దగా రిజిస్టర్ కాలేదు. నాగార్జున మేనల్లుడనే రాస్తున్నారు, రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అతని మూడో చిత్రం జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మొదలవుతోంది. జూన్ మొదటి వారంలో లాంఛనంగా ప్రారంభమయ్యే ఈ చిత్రంతో అయినా అతను క్లిక్ అయ్యి మేనల్లుడు అనే ముద్ర నుంచి బయిటకు వస్తాడా అని ఫిల్మ్ సర్కిల్స్ లో మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని కూడా హోమ్ ప్రొడక్షన్స్ శ్రీ నాగ్ కార్పోరేషన్ బ్యానర్ పైనే నిర్మిస్తున్నారు. యాక్షన్ కామిడీగా ఈ చిత్రం రూపొందబోతోందని చెప్తున్నారు. నాగేశ్వరరెడ్డి ఇంతకు ముందు సిక్స్ టీన్స్, గర్లె ప్రెండ్, సీమ శాస్త్రి వంటి కామిడీలు తీసి సక్సెస్ అయ్యారు. కొద్ది గా ట్రెండ్ మార్చుకుని యాక్షన్, మసాలా అంటూ కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ హీరోగా కాస్కో చేసారు. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ ఫెయిల్యూర్ అయింది. దాంతో ఈ చిత్రంపైనే నాగేశ్వరెడ్డి ఆశలు ఉన్నాయి. సుశాంత్ సైతం ఇదే చిత్రం తనకు లైఫ్ ఇస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి కోరకలు నెరవేరాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











