నాగార్జున మేనల్లుడు సుశాంత్ రెండో సినిమాకు రెడీ అవుతున్నాడు. మొదటి సినిమా 'కాళిదాసు' కలెక్షన్స్ 'కరచలనయాత్ర' కే సరిపోయాయన్న టాక్ తెచ్చుకోవటంతో ఈ చిత్రాన్ని మంచి హిట్ గా నిలపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ చిత్రానికి పవర్ ఫుల్ గా ఉండేందుకు 'కరెంట్' అనే టైటిల్ పెట్టూబోతున్నారని తెలుస్తోంది. యాక్షన్ ధ్రిల్లర్ గా తెరకెక్కే ఈ చిత్రాన్ని సుశాంత్ తల్లి నాగ సుశీల,కాళిదాసు నిర్మాత చింతలపూడి శ్రీనివాసు కలసి నాగ్ ఫిల్మ్ కార్పోరేషన్ పై నిర్మిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెలనుండి ప్రారంభం కానుంది.ఈ సారన్నా కరెంటు పోకుండా ఉండాలని కోరుకుందాం.