నాగార్జున మేనల్లుడు 'అడ్డా' ఖరారైంది
హైదరాబాద్: నాగార్జున మేనల్లుడు సుశాంత్ అలుపెరగని పోరాట యోధుడిలా వరసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో చిత్రం కమిటయ్యారు. ఆ చిత్రం టైటిల్ 'అడ్డా'. ట్యాగ్ లైన్ ..ప్లేస్ టు లవ్. సుశాంత్ తల్లి నాగసుశీల నిర్మిస్తున్న ఈ చిత్రానికి చింతలపూడి శ్రీనివాస్ సహ నిర్మాతగా వ్యవహిస్తారు. పూరి జగన్నాధ్ వద్ద అశోసియేట్ గా చేసిన సాయి రెడ్డి ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రం జూలై 28న అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రారంభం కానుంది.
అక్కినేని కుటుంబ సభ్యులంతా ఈ ఓపినింగ్ ఫంక్షన్ కి హాజరు కానున్నారు. కనల్ కన్నన్ ఫైట్స్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి అరుణ్ కుమార్ కెమెరా అందిస్తున్నారు. లవ్ లీ చిత్రంలో చేసిన శాన్వి ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనున్నట్లు సమాచారం. ఇక సుశాంత్ గత చిత్రం కరెంట్ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది.
ఇక ఈ కొత్త చిత్రం స్క్రిప్టు నిమిత్తం గత సంవత్సరకాలంగా సిట్టింగ్స్ జరుపుతున్నట్లు చెప్తున్నారు. యూత్ ని అడ్డా అనే టైటిల్ ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి సుశాంత్ తల్లి ఎ.నాగసుశీల ఈ చిత్రంపై బాగా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. 'సుశాంత్ చేసిన రెండు సినిమాల్లో మంచి పెర్ ఫార్మర్ గా పేరు వచ్చింది. మేం స్టార్ట్ చెయ్యబోతున్న ఈ మూడో చిత్రం ద్వారా తప్పకుండా సుశాంత్ మరోసారి అందరి ప్రసంసలు అందుకుంటాడు. మా బ్యానర్ లో ఇది మరో మంచి సినిమా అవుతుందంటూ నమ్మకం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగ సుశీల, కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం:సాయి రెడ్డి.


Click it and Unblock the Notifications











