నాగార్జున మేనల్లుడు 'అడ్డా'లో అడుగు పెట్టాక...

By Srikanya

Sushanth
హైదరాబాద్: నాగార్జున మనేల్లుడు సుశాంత్‌, శాన్వి జంటగా జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అడ్డా'. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీలో షూటింగ్ జరుగుతోంది. హీరో,హీరోయిన్స్ , ఇతర చిత్రబృందంపై కీలక సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ దర్శకుడు... ''ప్రేమ భావనపై ముసురుకున్న అపోహల్ని తొలగించే చిత్రమిది. నిజమైన ప్రేమకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. సుశాంత్‌ నటన కొత్త పంథాలో సాగుతుంది''అన్నారు.

నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ... నిత్యం ప్రేమికులదే అక్కడ సందడి. కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసుకొంటూ ఊసులు చెప్పుకొంటుంటారు. కప్పు టీని కొన్ని గంటలపాటు ఆస్వాదిస్తూనే ఉంటారు. అలాంటి ప్రేమికుల అడ్డాలోకి ఓ జంట వచ్చి చేరింది. గమ్మత్తేమిటంటే... ఆ ఇద్దరికీ ప్రేమపై సదభిప్రాయం లేదు. మరి అక్కడికొచ్చాక వాళ్ల మనసులు ఎలా మారిపోయాయో తెరపైనే చూడాలంటున్నారు.

హీరో సుశాంత్ మాట్లాడుతూ...ప్రేమ పేరు చెబితే అటు పెద్దవాళ్లలోనూ ఇటు యువతలోనూ చిన్నపాటి గందరగోళం ఉంటుంది. అందుకు కారణాలను వినోదాత్మకంగా మా చిత్రంలో చూపిస్తున్నాము. యాక్షన్ నేపథ్యంలో సాగే ఈ సినిమా ప్రస్తుతం వస్తున్న ప్రేమకథలకు భిన్నంగా పాజిటివ్ థాట్‌తో ఉంటుంది అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ..''నేటితరం సరైన భాగస్వామిని ఎంపిక చేసుకొంటోందా? లేదా? అనే కోణంలో సాగే కథ ఇది. నవంబరు నెలాఖరులోపు చిత్రీకరణ పూర్తవుతుంద''అని వివరించారు.

మరో నిర్మాత ఎ.నాగసుశీల మాట్లాడుతూ''జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనే క్రమంలో యువతరం ఎలా తడబాటుకు గురవుతోందనే విషయాన్ని దర్శకుడు చెప్పిన తీరు ఆకట్టుకొంటుంది. డిసెంబరులో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు . కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్‌, స్వప్నిక ఇతర పాత్రధారులు. ఛాయాగ్రహణం: ఎస్‌.అరుణ్‌కుమార్‌, సంగీతం: అనూప్‌ రూబెన్స్‌. నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.సాయికార్తీక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X