సుశాంత్ ‘అడ్డా’ ట్రైలర్ విడుదల (వీడియో)
హైదరాబాద్ : కాళిదాసు, కరెంట్ చిత్రాల్లో నటించిన హీరో సుశాంత్ ప్రస్తుతం శ్రీనాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.కార్తీకరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న 'అడ్డా'చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ తాజాగా విడుదల చేసారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాసరావు మాట్లాడుతూ 'మా 'అడ్డాకి' సంబంధించి ప్రస్తుతం డిటిఎస్ మిక్సింగ్ జరుగుతోంది. ఇటీవల రిలీజైన ఆడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అనూప్ రూబెన్స్ ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. త్వరలోనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ ట్రైలర్ ను 'అత్తారింటికి దారేది' సినిమాకి యాడ్ చేస్తున్నాం. ఈ చిత్రానికి బిజినెస్ పరంగా మంచి క్రేజ్ వచ్చింది. బయ్యర్స్ అందరూ మంచి ఆఫర్స్ తో తీసుకున్నారు. తప్పకుండా మా బేనర్లో సూపర్ హిట్ అవుతుంది' అన్నారు.
సుశాంత్, శాన్వి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్, తాగుబోతు రమేష్, నల్లవేణు, ధన్ రాజ్, స్విప్నిక తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : ఎస్.అరుణ్ కుమార్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఫైట్స్ : కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్ : ఎం.వి.ఎస్.వాసు, కోడైరెక్టర్ : డి. సాయికృష్ణ, పి.శ్రీను, నిర్మాతలు : చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం : జి.కార్తీక్ రెడ్డి.


Click it and Unblock the Notifications












