సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్.. పోలీసులకు దొరికిన అసలు ఆధారాలు ఇవే!
బాలీవుడ్ ఇండస్ట్రీకి మరో కోలుకోలేని దెబ్బ పడింది. కరోనా వైరస్ తో సతమతమవుతున్న తరుణంలో ఒక్కసారిగా బాలీవుడ్ లో గ్యాప్ లేకుండా విషాద ఛాయలు అలుముకోవడం షాక్ కి గురి చేస్తోంది. ధోని బయోపిక్ సినిమాతో ఇండియా మొత్తంగా గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సడన్ గా ఉరి వేసుకొని సూసైడ్ చేసుకోవడం సినీ ప్రపంచాన్ని తీవ్ర మనోవేదనకు లోను చేస్తోంది.

కన్నీటి తడి ఆరకముందే..
ఇటీవల బాలీవుడ్ లో రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్ వంటి సీనియర్ యాక్టర్స్ కన్నుమూసిన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్ కన్నీటి తడి ఆరకముందే యువ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న 34ఏళ్ల ఈ యువ హీరో మృతి చెందడం వెనుక అసలు కారణం ఏమిటనే విషయం ఇప్పుడు సంచలనంగా మారింది.

పోలీసుల సెర్చింగ్..
గత కొన్ని రోజులుగా సుశాంత్ మానసిక వేదనకు లోనవుతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడమే కారణమా? లేక ఇతర కారణాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు చెలరేగుతున్నాయి. ప్రస్తుతం ముంబై పోలీసులు సుశాంత్ ఫ్లాట్ ని పూర్తిగా పరిశీలిస్తున్నారు.

దొరికిన ఆధారాలు..
పూర్తిగా ఆధారాలు సేకరించిన తరువాతే పోలీసులు మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. ఇక సుశాంత్ చివరగా ఎవరెవరితో ఫోన్ లో మాట్లాడు అనే కోణంలో విచారిస్తున్న పోలీసులకు బలమైన ఆధారం అతని వాట్సాప్ చాట్ అనే తెలుస్తోంది. అలాగే సుశాంత్ కి సంబంధించిన ఒక డైరీ కూడా పోలీసులకు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Recommended Video

2020 నిజంగానే..
సుశాంత్ మృతి పట్ల బాలీవుడ్ సెలబ్రెటీస్ చాలా వరకు షాక్ కి గురవుతున్నారు. ఇప్పటికి ఈ విషయం నిజమని నమ్మలేకపోవుతున్నాం అని చెబుతున్నారు. ఇక మరికొందరైతే నిజంగా 2020 చాలా దరిద్రమైంది అంటూ కామెంట్ చేస్తున్నారు. నేడు సాయంత్రం సుశాంత్ రాజ్ పుత్ మృతికి గల కారణాలపై పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉందని నార్త్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.


Click it and Unblock the Notifications











