యూట్యూబ్‌లో సుశాంత్ తొలి వరల్డ్ రికార్డ్.. నెంబర్ వన్ ట్రైలర్ అతడిదే!

ఒక సినిమాకు క్రేజ్ ఏ స్థాయిలో ఉందొ తెలియాలి అంటే యూట్యూబ్ ద్వారానే తెలుస్తోంది. సాంగ్స్ , టీజర్, ట్రైలర్, క్లిక్కయితే ఆటోమేటిక్ గా సినిమాకు వచ్చే రెస్పాన్స్ ఉహీంచని విధంగా పెరుగుతుంది. ఇక ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆఖరి సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయగా రికార్డు స్థాయిలో లైకులు అందుకుంది. గతంలో అత్యదిక వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్స్ కూడా అతని సినిమా తరువాతే నిలిచాయి.

అవెంజర్స్ ఇన్ఫీనిటి వార్, ఎండ్ గేమ్ వంటి ట్రైలర్స్ ని దాటి వరల్డ్ నెంబర్ వన్ లైక్స్ అందుకున్న ట్రైలర్ గా క్రేజ్ అందుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరి సినిమా దిల్ బేచారా ట్రైలర్ మాత్రం 4.8మిలియన్స్ లైకులతో టాప్ లో కొనసాగుతోంది. ఇంకా ఆ లైకులతో పాటు వ్యూవ్స్ పెరుగుతాయని చెప్పవచ్చు.

Sushanth singh rajput dil bechara trailer new world record

ఇప్పటివరకు యూ ట్యూబ్ లో అత్యదిక లైకులు సాధించిన టాప్ 5 ట్రైలర్స్ విషయానికి వస్తే.. దిల్ బేచారా 5మిలియన్స్ దగ్గరలో ఉండగా హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఇన్ఫీనిటి వార్ 3.6మిలియన్ లైక్స్ తో రెండవ స్థానంలో ఉంది. ఆ తరువాత ఎండ్ గేమ్ ట్రైలర్ 1,2లు 3.2మిలియన్ లైక్స్ తో తరువాత స్థానాల్లో కొనసాగుతుండగా కోలీవుడ్ హీరో విజయ్ బిగిల్ ట్రైలర్ 5వ స్థానంలో ఉంది. ఆ సినిమాకు 2.3మిలియన్ లైక్స్ వచ్చాయి. ఈ టాప్ 5లో మొట్టమొదటి సారి ఒక బాలీవుడ్ హీరో ట్రైలర్ నిలవడం విశేషం.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అతని మరణం తరువాత జనాలు ఎంతగానో ఎమోషనల్ అయ్యారు. సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సిన దిల్ బేచారే సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ ఈ నెల 24న హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X