సుశాంత్ మృతిని తట్టుకోలేక 14 ఏళ్ల అభిమాని సూసైడ్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని తట్టుకోలేక మరో యువకుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదంగా మారింది. ఈ విషాద ఘటన నాగ్‌పూర్‌లోని జరిపట్కా ప్రాంతంలో చోటుచేసుకొన్నది. సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. యువ హీరో మరణాన్ని చాలా మందికి భావోద్వేగాన్ని మిగల్చడమే కాకుండా ఆ వార్తను ఇప్పటికి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో నాగపూర్‌లోని 14 ఏళ్ల బాలుడు సూసైడ్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే ఇలా సుశాంత్ అభిమానులు ఆత్మహత్య చేసుకొన్న ఘటన దేశవ్యాప్తంగా ఇది నాలుగోది కావడం గమనార్హం.
మీడియా కథనం ప్రకారం.. నాగ్‌పూర్‌లోని జరిపట్కా ప్రాంతానికి చెందిన ఓ కుటుంబానికి చెందిన బాలుడికి సుశాంత్ అంటే చెప్పలేనంత ఇష్టం. ఆయన మరణం తర్వాత ఓ రకమైన షాక్‌లోకి వెళ్లాడు. అప్పటి నుంచి విషాదంగా ఉండటం చూసి బాలుడిని అటెన్షన్‌ను మరలించేందుకు కుటుంబం ప్రయత్నించింది. టీవీలో వార్తలు చూడకుండా ప్రయత్నించారు. కానీ ఆ మానసిక వ్యధతో సూసైడ్ చేసుకొన్నారు అని పేర్కొన్నారు.

సుశాంత్ అభిమాని ఆత్మహత్య ఘటన నిజమే. అయితే ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ప్రాథమికంగా బాలుడి మరణాన్ని యాక్సిండెంటల్ డెత్‌గా నమోదు చేశాం అని జరిపట్కా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముంబై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 23 మందిని విచారించడం తెలిసిందే.


Click it and Unblock the Notifications











