30వ ఏట అడుగు పెడుతున్న నాగార్జునకు హ్యాపీ బర్త్‌డే: యంగ్ హీరో ట్వీట్

పేరుకు సీనియర్ హీరోనే అయినా అందంలో కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు అక్కినేని నాగార్జున. కేవలం ఆ విషయంలోనే కాదు.. సినిమాలు చేయడంలోనూ.. వ్యాపార ప్రకటనలు.. టీవీ షోలు ఇలా అన్నింటిలోనూ ఆయన టాలీవుడ్ హీరోలు అందరికంటే ముందే ఉన్నాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాగే, బుల్లితెరపైనా కొన్ని షోలతో మెప్పిస్తున్నాడు. ఇలా బిజీ బిజీగా గడుపుతున్న నాగార్జున 60వ పుట్టినరోజు నేడు (గురువారం). దీంతో ఆయనకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సోషల్ మీడియాలో నాగార్జున పేరు మారుమ్రోగిపోతోంది. అందుకే ట్విట్టర్‌లో 'హ్యాపీ బర్త్‌డే నాగ్' అనే యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఇదిలాఉండగా, అక్కినేని కాంపౌండ్ హీరో సుశాంత్ తన మామకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో '30వ పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న మామ. మిమ్మల్ని ఆఫ్ స్క్రీన్, ఆన్ స్క్రీన్‌లో దగ్గరుండి చూసి స్ఫూర్తి పొందే అవకాశం దక్కడం మా అదృష్టం. ఈ సంవత్సరం మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను' అంటూ ట్వీట్ చేశాడు.

Sushanth Special Wishes To Akkineni Nagarjuna

కొద్దిరోజుల క్రితం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చి.ల.సౌ' అనే సినిమాలో నటించిన సుశాంత్.. ప్రస్తుతం అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న 'అల.. వైకుంఠపురములో' చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవల అతడు నటించిన 'చి.ల.సౌ' సినిమాకు జాతీయ ఉత్తమ స్క్రీన్ ప్లే అవార్డు దక్కిన విషయం తెలిసిందే.

గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటించినన చిత్రం 'మన్మథుడు 2'. మనం ఎంటర్‌ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్స్‌, వయకామ్‌ 18 స్టూడియోస్‌ పతాకాలపై నాగార్జున అక్కినేని, పీ కిరణ్‌ (జెమిని కిరణ్‌) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో లక్ష్మి, వెన్నెలకిషోర్‌, రావు రమేష్‌, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటించారు. ఈ సినిమా కొద్ది రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X