ఫ్యాన్స్ గురించి మాట్లాడి నవ్వుల పాలైన యంగ్ హీరో
నాగార్జున మేనల్లుడు సుశాంత్ రీసెంట్ గా తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. కాళిదాసు,కరెంట్ అనే రెండు డిజాస్టర్ చిత్రాలు చేసిన సుశాంత్ ..ఈ సందర్భంగా మాట్లాడుతూ... అభిమానులను సంతృప్తిపరిచే అవకాశం నాకు దొరికింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశపరచను. మంచి విజయం లభించాక ఇతర సంస్థల్లో నటిస్తాను అన్నారు. ఇది విన్న వారంతా సుశాంత్ కు కూడా అబిమానులు ఉన్నారా అని నవ్వుకుంటున్నారు. నాగార్జున అభిమానులనే సుశాంత్ తన అబిమానులు అనుకుంటున్నాడా ఏమిటి అని జోకులు వేసుకుంటున్నాడు.
సుశాంత్ కొంచెం బిల్డప్ గానే...హిట్ వచ్చేదాకా ఇతర సంస్ధల్లో చేయను అంటే..అస్సలు బయిట సంస్ధల్లో ఎవరు సుశాంత్ కి ఆఫర్ ఇస్తున్నాడని అలా చెప్తున్నాడని బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సుశాంత్ ..దర్సకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో చేస్తున్నారు. మోహన్ కృష్ణ రీసెంట్ గా సుమంత్ తో గోల్కోండ హైస్కూల్ అనే చిత్రం రూపొందించారు. సంక్రాతికి విడుదలైన ఆ చిత్రం ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. శ్రీ నాగ్ కార్పోరేషన్ పతాకంపై ఈ చిత్రాన్ని చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications











