twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పి.సుశీల- 'విశ్వవిఖ్యాత సంగీత కళా సరస్వతి'

    By Bojja Kumar
    |

    ప్రముఖ గాయని పి. సుశీలను 'విశ్వవిఖ్యాత సంగీత కళా సరస్వతి" పురస్కారంతో సన్మానించనున్నట్లు లలితకళా పరిషత్ వ్యవస్థాపకులు టి సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ఈ విషయమై బంజారాహిల్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడు విశాఖపట్నంలో ఈ నెల 17న సాయంత్రం 4.30 గంటలకు విశాఖ కళావాణి స్టేడియంలో ప్రముఖ గాయని డాక్టర్ పి.సుశీల గాన వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.రెండు రోజుల పాటు కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవోపేతంగా వైవిధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

    ఇందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన విశాఖ కళాభారతి ఆడిటోరియంలో ఆధ్యాత్మికవేత్తలకు, దైవారాధకులకు అపూర్వ సత్కారం చేస్తున్నామని ప్రముఖ నాదనిధి అన్నవరపు రామస్వామిని స్వర్ణకంకణ పురస్కారంతో సత్కరిస్తున్నట్లు తెలిపారు. పి.సుశీలకు విశ్వవిఖ్యాత సంగీత కళాసరస్వతి అవార్డును అందచేస్తున్నామన్నారు. ఈ వేదికపై ఎస్.జానకి, పి.బి.శ్రీనివాస్, ఏసుదాస్, వాణీ జయరామ్, ఎల్.ఆర్.ఈశ్వరికి కూడా సత్కారం జరుగుతుందని, డా. అక్కినేని నాగేశ్వరరావు, డా. చిరంజీవి, రామ్‌చరణ్‌తో పాటు సినీ ప్రముఖులు, కేంద్రమంత్రులు, రాష్ట్రమంత్రులు పలువురు హాజరుకానున్నారని, డా.కె. రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. 23 జిల్లాల్లో ఏసీ ఆడిటోరియాలను నిర్మించాలనే కార్యక్రమంలో భాగంగా త్వరలో వైజాగ్ ఆడిటోరియాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేవంలో ప్రముఖ నిర్మాత డి. రామానాయుడుతో పాటు, అలనాటి సీనియర్ నటి వాణిశ్రీ పాల్గొన్నారు.

    English summary
    Famous play back singer P. Susheela will be honors with Viswa Vikhyatha Kala Saraswathi Award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X