రామ్ చరణ్‌కి సరైన జోడీ ఆమెనే.. అదే జరిగితే కాదంటామా? అభిమానులు షాక్: కొణిదెల డాటర్ కామెంట్స్

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు కొణిదెల సుస్మిత మాట్లాడిన మాటలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సొంత తమ్ముడు రామ్ చరణ్ గురించి, మేనమామ కొడుకు అల్లు అర్జున్ గురించి ఆమె చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ సుస్మిత ఏమంది? అసలు మ్యాటర్ ఏంటి? వివరాల్లోకి పోతే..

కొణిదెల వారసురాలి ఇంటర్వ్యూ..

కొణిదెల వారసురాలి ఇంటర్వ్యూ..

ఇటీవలే తండ్రి చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమా 'సైరా నరసింహా రెడ్డి'కి క్యాస్టూమ్ డిజైనర్‌గా పనిచేసి భేష్ అనిపించుకున్న సుస్మిత తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో భాగంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ డాన్స్ పర్‌ఫార్‌మెన్స్ గురించి అదేవిధంగా 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీమేక్ గురించి మాట్లాడింది.

సుస్మిత రియాక్షన్.. రామ్ చరణ్ అభిమానులు షాక్

సుస్మిత రియాక్షన్.. రామ్ చరణ్ అభిమానులు షాక్

టాలీవుడ్ చిత్రసీమలోని నేటి హీరోల్లో సూపర్ డాన్సర్స్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్. ఇందులో ఇద్దరు మెగా హీరోలే. దీంతో ఈ మెగా హీరోలిద్దరిలో బెస్ట్ ఎవరనే దానిపై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో కొణిదెల సుస్మితకు ఇదే ప్రశ్న ఎదురుకాగా రామ్ చరణ్ అభిమానులు షాకయ్యేలా రియాక్ట్ అయింది సుస్మిత.

రెండో ఆలోచనే లేదు.. కొణిదెల డాటర్ ఆన్సర్

రెండో ఆలోచనే లేదు.. కొణిదెల డాటర్ ఆన్సర్

నిజానికి మెగా వారసత్వంతో తెర మీదకొచ్చిన బన్నీ, చెర్రీ ఇద్దరూ బెస్ట్ డాన్సర్లే. కానీ ఈ ఇద్దరిలో ఎవరు బెటర్ అంటే ఆలోచన లేకుండా అల్లు అర్జున్ అని జవాబు చెప్పేసింది కొణిదెల సుస్మిత. చరణ్ కంటే అల్లు అర్జున్ బెటర్ డ్యాన్సర్ అని కితాబునిచ్చింది. దీంతో ఈ ఇష్యూ ఫిలింనగర్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీమేక్..

'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీమేక్..

దీంతో పాటు ఈ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలపై తన అభిప్రాయాలు తెలిపింది సుస్మిత. రామ్ చరణ్ ఏ మెగా రీమేక్ చేస్తే బావుంటుందో కూడా చెప్పింది. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీమేక్ రామ్ చరణ్ చేయాలని తాను భావిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

రామ్ చరణ్ జోడీగా ఆమెనే బెటర్..

రామ్ చరణ్ జోడీగా ఆమెనే బెటర్..

అంతేకాదు ఈ తరం జగదేకవీరుని సరసన నిన్నటి తరం అతిలోకసుందరి అయిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటించాలని కోరుకుంటున్నట్లు సుస్మిత తెలిపింది. దీంతో చరణ్, జాన్వీ కాంబినేషన్‌లో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' రీమేక్ వస్తే మనం మాత్రం కాదంటామా? వెంటనే కానిచ్చేసేయండి అంటూ రియాక్ట్ అవుతున్నారు మెగా అభిమానులు.

Recommended Video

NTR & Ram Charan Important Message to Fans | Filmibeat Telugu
రామ్ చరణ్ RRR

రామ్ చరణ్ RRR

ఇకపోతే ప్రస్తుతం RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్నారు. మరో హీరో ఎన్టీఆర్.. కొమురం భీం రోల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X