తీవ్రమైన గుండెపోటు.. 95 శాతం నాళాలు క్లోజ్.. మృత్యు అంచుల్లోకి.. సుస్మితా సేన్
విశ్వ సుందరి సుస్మితా సేన్ గుండెపోటుకు గురయ్యారనే వార్తలు అభిమానుల, సినీ వర్గాలను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేశాయి. ఆమె గుండెకు సర్జరీ చేసి స్టంట్స్ వేశారనే విషయంపై అభిమానుల్లో ఆందోళన వ్యక్తమైంది. హర్ట్ ఎటాక్‌కు గురైన విషయాలను గోప్యంగా ఉంచారు. అయితే తనకు చికిత్స పూర్తయిన తర్వాత గానీ తనకు జరిగిన ప్రమాదకర విషయాలను ప్రపంచానికి వెల్లడించారు. అయితే హార్ట్ ఎటాక్ జరిగిన విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారనే విషయంపై ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో వెల్లడిస్తూ...

తీవ్రమైన గుండెపోటుతో
నేను భారీ గుండెపోటుకు గురయ్యాను. ఆ గుండెపోటు చాలా తీవ్రమైనది. గుండెలో 95 శాతం నాళాలు మూసుకుపోయాయి. ఆ గుండెపోటు సమయంలో చాలా సమయస్పూర్తితో వ్యవహారించాం. వెంటనే హాస్పిటల్‌లో చేరే ఏర్పాట్లు చేసుకొన్నాం. హార్ట్ ఎటాక్ గురవుతున్నానని భయపడలేదు. ధైర్యంగా ఉన్నాను. అదే నన్ను బతికించేలా చేసింది. మనోధైర్యమే నన్ను ప్రాణాలతో ఉండేలా చేసింది అని సుస్మితా సేన్ తెలిపారు

ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో
సకాలంలో ముంబైలోని నానావతి హాస్పిటల్‌లో చేర్చడంతో బతికి బయటపడ్డాను. నాకు గుండెపోటు వచ్చిందనే విషయం నా ఫ్యామిలికి, కొద్ది మందికి మాత్రమే తెలుసు. నా ఆరోగ్య పరిస్థితి గురించి ఎవరికి తెలియచేయవద్దని నేను చెప్పాను. నా స్నేహితులు, సన్నిహితులు నాకు అండగా నిలిచారు. అందుకు ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అని ఇన్స్‌టాగ్రామ్ లైవ్‌లో చెప్పారు.

ట్రీట్‌మెంట్ విషయాన్ని గోప్యంగా
నా ప్రైవసీకి భంగం కలుగకుండా వ్యవహరించిన ప్రతీ ఒక్కరికి నా ధన్యవాదాలు. నా ట్రీట్‌మెంట్‌కు, నా ఫ్యామిలీ మనోభావాలను గౌరవించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఉద్దేశపూర్వకంగానే నా ట్రీట్‌మెంట్ విషయాన్ని గోప్యంగా ఉంచాం. నా అంతట నేనే ఈ విషయాన్ని తెలియజేయాలని అనుకొన్నాను. అందుకే ఆలస్యంగా ఈ వార్తను నేను బయటి ప్రపంచానికి తెలియజేశాను అని సుస్మితా సేన్ చెప్పారు.

మెసేజ్ పంపిన అభిమానులకు
గుండెపోటుకు గురైన నాకు సకాలంలో వైద్యం అందించిన డాక్టర్లకు, నన్ను జాగ్రత్తగా చూసుకొన్న నా ఫ్యామిలీ మెంబర్స్‌కు, ట్రీట్‌మెంట్ తర్వాత నాకు శుభాకాంక్షలు, త్వరగా కోలుకోవాలని మెసేజ్ పంపిన అభిమానులకు నేను రుణపడి ఉంటాను అని సుస్మితా సేన్ ఎమోషనల్ అయ్యారు.
ఆర్య సీజన్ 3 షూటింగ్‌కు సుస్మితా సేన్
ప్రస్తుతం నా ఆరోగ్యం బాగుంది. డిశ్చార్జి తర్వాత తగినంత విశ్రాంతి తీసుకొన్నాను. డాక్టర్ల అనుమతితో జైపూర్‌లోని ఆర్య సీజన్ 3 షూటింగుకు వెళ్తున్నాను. తాలి అనే ఓటీటీ వెబ్ సిరీస్‌కు డబ్బింగ్ కూడా పూర్తయింది. ఈ వెబ్ సిరీస్‌లో గౌరి సావంత్ అనే ట్రాన్స్‌జెండర్‌గా నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











