twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుస్మితా సేన్ వేశ్యగా 'ఒసేయ్..మల్లమ్మ'

    By Srikanya
    |

    మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ ప్రధాన పాత్రలో చేసిన హిందీ చిత్రం 'చింగారి' ఇప్పుడు తెలుగులో 'ఒసేయ్..మల్లమ్మ' పేరుతో డబ్బింగవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని రంగ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వేశ్య వాస్తవ జీవితగాథ ఆధారంగా ప్రఖ్యాత దర్శకురాలు కల్పనాజ్మీ ఈ చిత్రం రూపొందించింది. ఇక చిత్ర కథ ప్రకారం ప్రజలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే ఓ గ్రామాధికారి ప్రతిరోజూ ఓ వేశ్యతో గడుపుతుంటాడు. కాలక్రమంలో ఆమె తనకంటూ ఓ ఆనందమయ జీవితాన్ని ఆశించి ఓ పోస్ట్‌మ్యాన్‌ని ప్రేమిస్తుంది. అది సహించని గ్రామాధికారి ఆ పోస్ట్‌మ్యాన్‌ని చంపిస్తాడు. దాంతో ఉగ్రరూపం దాల్చిన వేశ్య ఆ గ్రామాధికారిని ఎలా హతం చేస్తుందనేది క్లైమాక్స్. గ్రామాధికారిపై ఆమె తిరగబడే సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.వేశ్య పాత్రని సుస్మితా సేన్ పోషించగా, గ్రామాధికారి పాత్రను మిథున్ చక్రవర్తి చేసారు. ఇక ఈ చిత్రాన్ని జె పాండురంగారెడ్డి తెలుగులో అందిస్తున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X