ప్రియుడితో ముదురు భామ మైండ్ బ్లోయింగ్ ఫోజు.. యువకుడు, పొడుగైన వాడు అంటూ!
ప్రస్తుతం బాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్లు తమకన్నా తక్కువ వయసు ఉన్నవారిని ప్రేమలోకి దించే ట్రెండు నడుస్తుంది కాబోలు. చాలా ప్రేమ కథలు ఇదే తరహాలో సాగుతున్నాయి. ఆ జాబితాలోకి మాజీ ప్రపంచ సుందరి సుష్మిత సేన్ కూడా చేరినట్లు ఉంది. రొహ్మన్ షాల్ అనే యువకుడితో సుస్మిత సేన్ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ కోడై కూస్తోంది. ఈ వార్తలకు బలం చేకూరే విధంగానే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని కనిపిస్తున్నారు. తాజాగా సుస్మిత సేన్ తన ఇంస్టాగ్రామ్లో చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది.

ఖరారైపోయింది
సుస్మిత సేన్ రెగ్యులర్ గా సోషల్ మిడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉంటుంది. తనకు సంబందించిన విశేషాలని, ఫోటోలని సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. నాలుగు పదుల వయసులో కూడా సుస్మిత ఫిట్ నెస్ కు యువత ఫిదా అవుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా సుస్మిత చేసిన పోస్ట్ తో ఆమె ప్రేమలో ఉందనే విషయం ఖరారైందని అభిమానుల్లో చర్చ జరుగుతోంది.
తలక్రిందులుగా
కండలు తిరిగిన ఓ యువకుడి పక్కన అదిరిపోయే ఫోజులో సుస్మిత సేన్ కనిపిస్తోంది. ఇద్దరూ తలక్రిందులుగా చేతులపై నిలబడి ఫిట్ నెస్ కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్నారు. సుస్మిత సేన్ ఇంత క్లొజ్ గా అతడితో కనిపిస్తుండడంతో ప్రియుడే అని అంతా చర్చ జరుగుతోంది. ఇటీవల సుస్మితతో ఎక్కువగా కనిపిస్తున్న రొహ్మన్ షాల్ అని అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

పొడవైనవాడు
సుస్మిత అతడి పేరు ప్రస్తావించకుండా.. అతడు చాలా పొడవైన వాడు.. యువకుడు అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. ఇది పర్ఫెక్ట్ హ్యాండ్ స్టాండ్ అంటూ కూడా కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫ్యాషన్ షో సందర్భంగా
ఓ ఫ్యాషన్ షో సందర్భంగా సుస్మిత తొలి సారి రొహ్మన్ ని కలసినట్లు తెలుస్తోంది. అక్కడ ఏర్పడిన పరిచయం ప్రేమగా మారినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలసి ఇటీవల ఓ వెకేషన్ కు వెళ్లిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











