ప్రతి రాత్రీ అతని శాడిజంతో సుస్మితా సేన్ ని...
మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ లీడ్ రోల్ లో నటించిన 'చింగారి' చిత్రం తెలుగులోకి 'ఒసేయ్..మల్లమ్మ' టైటిల్ తో డబ్బింగై ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాత పిరమిడ్ ఫిలిమ్ ఫ్యాక్టరీ అధినేత జె. పాండురంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ...ప్రతి రాత్రీ గ్రామాధికారి శాడిజంతో మల్లమ్మ పడే వేదన ప్రేక్షకుల్ని కదిలిస్తోంది. మల్లమ్మగా టైటిల్ పాత్రను మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ అద్భుతంగా పోషించారు. గ్రామాధికారిపై మల్లమ్మ పగతీర్చుకునే సన్నివేశాలు వాళ్లని ఆకట్టుకుంటున్నాయి.తనకంటూ ఆనందమయ జీవితం కావాలని కోరుకున్న ఓ వేశ్య ఓ పోస్ట్‌మ్యాన్‌ని ప్రేమిస్తే, అది సహించలేని గ్రామాధికారి ఆ పోస్ట్‌మ్యాన్‌ని చంపించే సన్నివేశాలు అకట్టుకుంటున్నాయి అన్నారు. గ్రామాధికారి పాత్రలో మిథున్ చక్రవర్తి నటించారు. ఇక ఉత్తరప్రదేశ్‌లోని రంగ్‌పూర్ గ్రామానికి చెందిన ఓ వేశ్య వాస్తవ జీవితగాథ ఆధారంగా ప్రఖ్యాత దర్శకురాలు కల్పనా లజ్మి ఈ చిత్రాన్ని రూపొందించింది.


Click it and Unblock the Notifications











