twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి కొడుకు పెళ్ళిలో ప్రియుడితో హీరోయిన్.. ప్రభాస్ పక్కనే మెరిసిపోతోంది!

    |

    దర్శక ధీరుడు రాజమౌళి తనయుడి వివాహం జైపూర్ లో వైభవంగా జరిగిది. కార్తికేయ, పూజా వివాహానికి టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. జూ. ఎన్టీఆర్, రాంచరణ్, రానా, ప్రభాస్, అనుష్క, అఖిల్, జగపతి బాబు ఇలా చాలా మంది సెలెబ్రిటీలు పెళ్లి వేడుకలో రాజమౌళి కుటుంబ సభ్యులతో కలసి చేశారు. రాజమౌళి వీళ్లందరితో కలసి డాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. కార్తికేయ, పూజ వివాహ వేడుక సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పెళ్లి వేడుకలో ప్రభాస్, అనుష్క జంటగా కనిపించడంతో ఆ దృశ్యాలు కూడా సోషల్ మీడియాని దున్నేస్తున్నాయి. ప్రభాస్ మరో సీనియర్ హీరోయిన్ తో ఉన్న ఫోటోలు కుడా నెటిజన్స్ ని ఆకర్షిస్తున్నాయి.

    ప్రియుడితో వచ్చిన సీనియర్ హీరోయిన్

    ప్రియుడితో వచ్చిన సీనియర్ హీరోయిన్

    టాలీవుడ్ సెలెబ్రిటీల మధ్య జరుగుతున్న కార్తికేయ వివాహ వేడుకలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మిత సేన్ అట్రాక్షన్ గా మారింది. ఏకంగా ప్రియుడితో కలసి వివాహానికి వచ్చి సర్పైజ్ చేసింది. సుస్మిత తనకన్నా వయసులో చిన్నవాడైన మోడల్ రొహ్మన్ తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ చేతిలో చేయి వేసుకుని జంటగా రాజమౌళి తనయుడి వివాహానికి హాజరయ్యారు.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    ప్రభాస్‌తో కలసి

    ప్రభాస్‌తో కలసి

    దేశవ్యాప్తంగా ప్రభాస్ అంటే తెలియని సినీ ప్రముఖులు , అభిమానులు ఉండరు. బాహుబలి చిత్రంతో ప్రభాస్ క్రేజ్ అంతగా పెరిగింది. ప్రభాస్ ఎక్కడకు వెళ్లినా ఆకర్షణగా మారుతున్నాడు. రాజమౌళి కొడుకు పెళ్ళిలో ప్రభాస్, సుస్మిత సేన్ కలసి ఫొటోకు ఫోజిచ్చారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుస్మిత సేన్ మాజీ ప్రపంచ సుందరి. పూజ తల్లిదండ్రులతో ,ప్రభాస్ తో సుష్మిత సేన్ విడివిడిగా ఫోటోలు దిగింది.

    పెళ్లి వీడియో

    రాజమౌళి కొడుకు వివాహంలో గుర్తుంచుకొదగ్గ దృశ్యాలని సుస్మిత సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కార్తికేయ, పూజా తలంబ్రాలు పోసుకుంటున్న అందమైన వీడియోని కూడా తన ఇంస్టాగ్రామ్లో షేర్ చేసింది. పూజ, కార్తికేయ వివాహం గత ఏడాది డిసెంబర్ 29న జైపూర్ లో వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

    త్వరలో ఒక్కటి కాబోతున్న జంట

    త్వరలో ఒక్కటి కాబోతున్న జంట

    సుష్మిత నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా వివాహం చేసుకోలేదు. ఇద్దరు పిల్లలని మాత్రం దత్తత తీసుకుని పెంచుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల సుస్మిత యువ మోడల్ రొహ్మన్ ప్రేమలో పడింది. వీరిద్దరూ సహజీవనం చేస్తూ పబ్లిక్ గానే తిరుగుతున్నారు. త్వరలో వీరిద్దరూ ఒక్కటి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    English summary
    Sushmita Sen and Prabhas pose for a picture worth cherishing at SS Karthikeya's wedding
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X