పెళ్లి చేసుకోబోతున్న సుస్మితా సేన్
ముంబై : బాలీవుడ్ బ్యూటీ సుస్మితా సేన్ 36 ఏళ్ల వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటుగా సినీరంగంలో ప్రవేశించిన నటీమణులందరూ పెళ్లి చేసుకోగా.. సుస్మితాసేన్ మాత్రం ఇప్పటికీ లవ్ ఎఫైర్స్‌తో వార్తల్లో కనిపిస్తూనే ఉంది.
అమ్మడుకి ఎట్టకేలకు సంసార జీవితంపై మోజు కలిగినట్లుంది. పెళ్లి చేసుకబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది. నేను వివాహం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను. బహుశా వచ్చే ఏడాది ఇది జరగవచ్చు అని 36 ఏళ్ళ సుస్మితాసేన్ స్పష్టం చేసింది. అయితే ఎవరిని పెళ్లి చేసుకోబోతోంది అనే విషయం మాత్రం ఆమె ఇంకా వెల్లడించలేదు.
వివాహ వ్యవస్థను నేను దృఢంగా విశ్వసిస్తాను. పెళ్లికి ఇది తగిన సమయమని నాకు అనిపిస్తోంది. పొడవాటి గౌను వేసుకుని రాజకుమారిలా క్రైస్తవ పద్దతిలో వివాహం చేసుకోవాలని నాకు ఉంది, మా నాన్న కోరినందున నేను భారతీయ సాంప్రదాయ వివాహం కూడా చేసుకుంటాను అని వెల్లడించింది.
సుస్మితా సేన్ గతంలో బాలీవుడ్ నటుడు రణదీప్ హుడాతో డేటింగ్ చేసింది. అటు తర్వాత యాడ్ మేకర్ మానవ్ మీనన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగింది. ఆ పైన బంటీ సచ్‌దేవ్‌తో కాలక్షేపం చేసిన సుస్మితా అనంతరం పాకిస్థాన్ పేసర్ వసీమ్ అక్రమ్‌తో కలిసి తిరిగిందనే వార్తలు వినిపించాయి.
సినిమాల విషయానికొస్తే....సుస్మితాసేన్ నాగార్జునతో తెలుగులో రక్షకులు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఆమె తెలుగు సినిమాల్లో నటించలేదు. ఆ చిత్రం పెద్దగా హిట్ కాక పోవడంతో ఆ తర్వాత మళ్లీ సుస్మితా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.


Click it and Unblock the Notifications












