For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సుస్మితాసేన్‌కు పదో బ్రేకప్.. అతనితో తెగతెంపులు.. సిగ్గుపడుతున్నాను..

  By Rajababu
  |

  మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ జీవితంలో మరో ప్రేమ వ్యవహారం విఫలమైంది. గత కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్న రితిక్ భాసిన్‌తో తన రిలేషన్‌ తెగతెంపులు చేసుకొన్నదనే వార్తలు ముంబై మీడియాలో షికార్లు చేస్తున్నాయి. సుస్మితా సేన్ సన్నిహితులు కూడా ధ్రువీకరించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. దాంతో సుస్మితా సేన్ జీవితంలో పదో బ్రేకప్ కావడం గమనార్హం. ఇప్పటికి ఒంటరిగానే ఉంటూ ఇద్దరు పిల్లలను దత్తత తీసుకొని జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న సుస్మిత గురించి మరిన్ని విషయాలు.

   ఆరు నెలలుగా వేర్వేరుగా

  ఆరు నెలలుగా వేర్వేరుగా

  రితిక్‌, సుస్మిత సేన్ విడిపోయారు. గత 6 నెలలుగా వారు వేర్వేరుగా ఉంటున్నారు. వారు విడిపోయి చాలా నెలలు అవుతున్నది. వారిద్దరు కలిసి కనిపించి చాలా రోజులైంది. మళ్లీ రితిక్, సుస్మిత కలుస్తారు అనే విషయం అనుమానమే అని ఓ పత్రిక కథనాన్ని వెల్లడించింది.

   కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎవరు

  కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎవరు

  అంతేకాకుండా సోషల్ మీడియాలో సుస్మిత పెట్టిన పోస్ట్ ఆ వార్తకు మరింత బలం చేకూరింది. సుస్మిత ప్రస్తుతం మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉంది అని ముంబై మీడియా కోడై కూస్తున్నది. అయితే ఆమె రితిక్‌తో బ్రేకప్‌ను పట్టించుకోవడం లేదనిది ఈ పోస్ట్ సారాంశంగా మారింది. అసలు కొత్త వ్యక్తి ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్.

   అతడు చెప్పే విషయాలు

  అతడు చెప్పే విషయాలు

  అతను చెప్పే అందమైన విషయాలు జీవితంలో చాలా అర్థవంతంగా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రేమలో ఉండటం ఒక విషయం. ప్రేమ సర్వస్వం అనుకోవడం మరో ఎత్తు. ఈ విషయాన్ని చెప్పడానికి చాలా సిగ్గుపడుతున్నాను. ఏం చేయాలి చెప్పక తప్పడం లేదు. మీ అందరికి నా ముద్దులు అని పోస్ట్‌లో పేర్కొన్నది.

   రితిక్ భాసిన్ ఎవరు

  రితిక్ భాసిన్ ఎవరు

  రితిక్ భాసిన్ ఎవరంటే.. ముంబైలో పాపులర్ నైట్ క్లబ్ రెడ్ లైట్ యజమాని. అంతేకాకుండా ఓరియన్ ఎంటర్‌టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. గత నాలుగేళ్లుగా సుస్మితా సేన్‌తో అఫైర్‌లో ఉన్నాడు.

   విక్రమ్ భట్‌తో సుస్మితా

  విక్రమ్ భట్‌తో సుస్మితా

  రితిక్‌కు ముందు విక్రమ్ భట్‌తో సుస్మితా సేన్ లవ్‌లో పడింది. దస్తక్ షూటింగ్ సందర్భంగా వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. సుస్మితా సేన్ కోసం విక్రమ్‌ తన భార్యకు దూరమయ్యాడు. ఆ తర్వాత విభేదాలు రావడంతో సుస్మిత సేన్, విక్రమ్ విడిపోయారు.

  తనకంటే చిన్న రణదీప్‌తో

  తనకంటే చిన్న రణదీప్‌తో

  సుస్మితా సేన్ జీవితంలో మరో అఫైర్ రణదీప్ హుడాతో కొనసాగించింది. సుస్మితా కంటే రణ్‌దీప్ వయస్సులో చాలా చిన్నవాడు. ప్రేమ గుడ్డిది అనడగానికి వారి ప్రేమ నిదర్శనంగా నిలిచింది. కర్మ సినిమా షూటింగ్ సందర్భంగా వారిద్దరూ చాలా ఘాటుగా ప్రేమలో మునిగిపోయారు. కెరీర్‌కు ముప్పు ఏర్పడుతుందనే కారణంతో సుస్మితాకు రణ్‌దీప్ దూరమయ్యాడు.

   వసీం అక్రమ్‌కూ గుడ్ బై

  వసీం అక్రమ్‌కూ గుడ్ బై

  సుస్మిత లైఫ్‌లో ఇంట్రస్టింగ్ అఫైర్ పాకిస్థాన్ క్రికెటర్ వసీం అక్రమ్‌తో. భార్య చనిపోయిన తర్వాత వసీమ్ కొంతకాలం సుస్మితాతో లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నాడు. ఆ తర్వాత పెళ్లి వరకు వారి ప్రేమ దారి తీసింది. అయితే మతపరమైన ఇబ్బందులతో వారి ప్రేమకు పుల్‌స్టాప్ పడింది.

   ముదసర్ అజీజ్‌తో సుస్మితా

  ముదసర్ అజీజ్‌తో సుస్మితా

  పెంపుడు కూతురు రీనీకి చాలా సన్నిహితుడైన ముదసర్ అజీజ్‌తో కొంతకాలం సుస్మితా రిలేషన్‌ షిప్‌లో ఉన్నారు. ఎందుకో గానీ ఎక్కువ రోజులు వారు తమ బంధాన్ని కొనసాగించలేకపోయారు.

   ఇంతియాజ్ ఖాత్రీతో రిలేషన్

  ఇంతియాజ్ ఖాత్రీతో రిలేషన్

  అంతకుముందు ఇంతియాజ్ ఖాత్రీ అనే వ్యాపారవేత్తతో సుస్మితా సేన్ రిలేషన్ కొనసాగింది. అయితే వారి మధ్య రిలేషన్ చాలా తక్కువ కాలం సాగింది. వారి విడిపోవడానికి పెద్దగా కారణాలు లేవని చెప్పుకొంటారు.

   మానవ్ మీనన్‌తో తెగతెంపులు

  మానవ్ మీనన్‌తో తెగతెంపులు

  సుస్మితా సేన్ జీవితంలో ప్రవేశించిన మరో వ్యక్తి మానవ్ మీనన్. ఎందుకో వీరిద్దరి సంబంధం తెగతెంపులు కావడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. అభిరుచులు, అభిప్రాయలు, ఇతర విభేదాల కారణంగా విడిపోయారు అని చెప్పుకొంటారు.

   సంజయ్ నారంగ్‌తో సుస్మిత

  సంజయ్ నారంగ్‌తో సుస్మిత

  సంజయ్ నారంగ్ అనే వ్యాపారవేత్తతో రిలేషన్ సుస్మితా సేన్ జీవితంలో ఎక్కువగా చర్చనీయాంశమైన లవ్ స్టోరిగా నిలిచింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు. ఉన్నట్టుండి వారిద్దరూ విడిపోవడం బాలీవుడ్ వర్గాలను నివ్వెరపాటుకు గురిచేసింది.

   సబీర్ భాటియాతో సుష్

  సబీర్ భాటియాతో సుష్

  హాట్ మెయిల్ వ్యవస్థాపకుడు సబీర్ భాటియాతో రిలేషన్ చాలా ఇంట్రస్టింగ్‌గా చెప్పుకొంటాడు. సుస్మిత అంటే భాటియా పడి చచ్చేవాడని పేర్కొంటారు. సుస్మితాపై ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి 10.5 క్యారెట్ల డైమండ్ రింగ్‌ను బహుకరించాడు. కానీ వారిద్దరి రిలేషన్ పెళ్లి వరకు చేరలేదు.

   బంటీ సచ్‌దేవాతో దారుణం

  బంటీ సచ్‌దేవాతో దారుణం

  బంటీ సచ్‌దేవా అనే వ్యక్తితో ప్రేమ వ్యవహారం సుస్మితా జీవితంలో అత్యంత దారుణమైనది. అప్పటికే బంటీకి నేహా దుపియా, దియా మిర్జాతో బ్రేకప్ అయింది. బంటీతో అఫైర్ కారణంగా సుస్మితా చాలా నష్టఫోయింది అని చెప్పుకొంటారు.

  English summary
  Actress Sushmita Sen, who is always in limelight because of her alleged affairs and more than that her short-period relationships, is again in headline because of her break-up! Reportedly, Sush has parted ways with tenth alleged boyfriend, Ritik Bhasin, who is the owner of Mumbai's popular nightclub Red Light and also the director of Orion Entertainment Private Limited, after dating him for almost two years.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X