Waltair Veerayya: సుస్మిత కొణిదెలకు ఆ అవార్డ్.. చిరంజీవి ముందే అలా.. అతడిని బ్రదర్ అన్న మెగా డాటర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. అరవై ఏళ్ల వయసులోనూ ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ సత్తా చాటుతోన్నాడు మెగాస్టార్ చిరంజీవి. కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకపోతోన్న ఆయన.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి 'వాల్తేరు వీరయ్య' అనే మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా సాగుతోంది. ఇందులో సుస్మిత కొణిదెల ఆసక్తికరమై కామెంట్స్ చేశారు. అవేంటో మీరే చూసేయండి మరి!

వీరయ్యగా రాబోతున్న చిరు
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రమే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను చేస్తోన్న ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా చేశారు.

వైభవంగా వీరయ్య ఈవెంట్
బడా మల్టీస్టారర్‌గా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీ రిలీజ్‌కు రెడీ అవడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ గ్రౌండ్స్‌లో నిర్వహిస్తున్నారు. ఎంతో వైభవంగా జరుగుతోన్న ఈ వేడుకకు మెగా ఫ్యాన్స్ భారీ సంఖ్యలో వచ్చి సందడి చేస్తున్నారు.

సుస్మిత కొణిదెల కామెంట్స్
'వాల్తేరు వీరయ్య' మూవీకి మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతోన్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె ఎన్నో అంశాలు మాట్లాడారు. స్టేజ్ మీదకు వచ్చిన ఆమెను సుమ 'మీరు చిరు కూతురిలా కాకుండా మెగాస్టార్‌తో పని చేసిన డిజైనర్‌గా మాట్లాడాలి' అని కోరడంతో అలాగే మొదలెట్టారు.

మొత్తం అలా.. పాటల్లో ఇలా
'వాల్తేరు వీరయ్య' ఈవెంట్‌లో సుస్మిత 'నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. బాబీ గారి నుంచి ఈ స్టోరీ వినగానే మెగాస్టార్ గారి కోసమే రాసినట్లు అనిపించింది. ఇన్ని సినిమాల్లో ఆయన ఎన్నో రకాలుగా కనిపించారు. ఈ సినిమాలో ఒక ఫ్యాన్‌గా ఆయనను ఎంత కొత్తగా చూపించాలా అనుకున్నా. మూవీ అంతా ఒకలా చూపించినా సాంగ్స్‌లో కొత్తగా చూపించాను' అని చెప్పారు.

యంగ్‌గా చాలెంజ్ ఇస్తూనే
ఆ తర్వాత సుస్మిత కొణిదెల కంటిన్యూ చేస్తూ 'ఈ సినిమాలోని పాటల్లో మాత్రం ఆయనను ఎంతో స్టైలిష్‌గా, యంగ్‌గా చూపించాలని అనుకున్నా. అనుకున్నట్లుగానే ఆయన ఇంకా యంగ్‌గా అవుతున్నారు. అలా ఆయన నాకు చాలెంజ్ ఇస్తూ ఉంటారు. థ్యాంక్యూ మైత్రీ మూవీ మేకర్స్. నాకు మరోసారి ఆయనతో కలిసి పని చేసే అవకాశం కల్పించారు' అంటూ చెప్పుకొచ్చారు.

మా బ్రదర్ కోసం అంటూ
'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుస్మిత కొణిదెల.. దర్శకుడు బాబీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. 'ఈ సినిమాలో పని చేయడం ఇంకాస్త స్పెషల్. ఎందుకుంటే మా బ్రదర్ బాబీ గారితో వర్క్ చేయడమే. ఆయన ఈ మూవీని ఎంతో చక్కగా డీల్ చేసి మంచి ఔట్‌పుట్ ఇచ్చారు. సుమ గారు చెప్పినట్లు మూడు.. జనవరి పదమూడు కోసం వేచి చూస్తున్నా' అని అన్నారు.

సుస్మితకు ఆ అవార్డు అని
ఈ ఈవెంట్‌లో సుమ 'ఇన్ని నెలల పాటు మీరంతా కలిసి పని చేశారు కాబట్టి.. మీ టీమ్‌లోని కొందరికి అవార్డులు ఇవ్వాలని అనుకుంటున్నాం. బెస్ట్ సిన్సియర్ పర్సన్ అవార్డు ఎవరికి ఇస్తే బాగుటుందో చెప్పండి' అని అడిగింది. దీంతో సుస్మిత కొణిదెల 'ఈ అవార్డు నేనే తీసుకుంటా' అని చెప్పి షాకిచ్చింది. దీంతో సుమ తర్వాత ఈ అవార్డును చెక్కి పంపిస్తా అని చెప్పింది.


Click it and Unblock the Notifications











