త్రివిక్రమ్ చిత్రంలో పవన్ లుక్ ఇదేనా?
హైదరాబాద్ : త్వరలో పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మొదలైన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ లుక్ పై అందరిలో ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో ఆయన ఎలా కనిపించనున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా మొన్న శుక్రవారం ఆయన తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ కొత్త చిత్రం ఫంక్షన్ కి వచ్చినప్పుడు గెడ్డంతో ఓ డిఫెరెంట్ లుక్ తో కనిపించారు. అదే సినిమాలో కంటిన్యూ కానుందా అనే విషయం ఇప్పుడు అభిమానులను ఆలోచనలో పడేస్తోంది.
ఇక ఈ తాజా చిత్రంలో పవన్ కళ్యాణ్ ..అర్బన్ యూత్ ని రిప్రజెంట్ చేసే పాత్రను చేస్తున్నారని సమాచారం. ఇందుకోసం ప్రత్యేకమైన కసరత్తు నిర్మాత,హీరో చేస్తున్నారని సమాచారం. రీసెంట్ గా సినిమాలో కనపడే లుక్ కోసం ప్రత్యేకంగా ఫోటో షూట్ చేసి చూసుకున్నారని అంటున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా చిత్రం నడిచినా పాత్ర మాత్రం ఈ జనరేషన్ యూత్ ని గుర్తు చేసేలా ఉండాలని పవన్ ప్రత్యేకంగా చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. గెడ్డంతో కనపడితే గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి పాత్ర గుర్తుకు వస్తుందంటున్నారు.
పవన్-త్రివిక్రమ్ మూవీ ఓపెనింగ్ ఫంక్షన్ నవంబర్ 23 ఫిల్మ్ నగర్లో జరిగింది. ఫిల్మ్ నగర్ శ్రీవెంకటేశ్వర స్వామి దేవాలయంలో పూజా ఫార్మాలిటీస్ పూర్తి చేసారు. భారీ నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాతగా, రిలియన్స్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రెవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతుంది.
నిర్మాత బివిఎస్ ఎన్ ప్రసాద్ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం రోజుల్నించీ మంచి సినిమా చెయ్యాలన్న కోరిక ఉంది. అది ఇన్నాళ్లకు నెరవేరింది. పవన్, త్రివిక్రమ్ గార్ల కాంబినేషన్ లో ఇంత మంచి ప్రాజెక్టు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు. డిసెంబర్ రెండవ వారం నుంచి రెగ్యులర్ షూట్ జరగుతుందని తెలియచేసారు.


Click it and Unblock the Notifications











