విడిపోవడానికి ఆయన కారణం కాదు: హృతిక్ భార్య
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానె రోషన్ విడిపోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని వారే స్వయంగా ప్రకటించారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి కారణం నటుడు అర్జున్ రాంపాల్ అంటూ ఇటీవల రూమర్లు ప్రచారంలోకి వచ్చాయి. అర్జున్, సుజానె మధ్య ఎఫైర్ ఉందని..ఆ వ్యవహారమే వారి కాపురంలో చిచ్చు పెట్టిందనే గాసిప్స్ వినిపించాయి.
ఈ వార్తలను అర్జున్ రాంపాల్ ఇప్పటికే ఖండించారు. అయితే సుజానె మాత్రం మౌనంగానే ఉంటూ వచ్చారు. అయితే నిన్న తన న్యూ లైఫ్ స్టైల్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా ఈ విషయంపై నోరు విప్పారు సుజానె. ' మేం విడిపోవడానికి, అర్జున్‌కు ఎలాంటి సంబంధం లేదు. హృతిక్‌తో పాటు నాకు ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్. మేం విడిపోవడానికి ఇతరులు ఎవరూ కారణం కాదు. దయచేసి ఎవరినీ బ్లేమ్ చేయవద్దు' అని సుజానె వ్యాఖ్యానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అర్జున్ రాంపాల్ కూడా తన భార్య మెహర్‌తో హాజరయ్యారు.
అయితే హృతిక్‌తో విడిపోవడానికి కారణమేంటో చెప్పడానికి సుజానె నిరాకరించింది.'కొన్ని సార్లు ఎలాంటి కారణాలు ఉండవు. కొన్ని అనుకోకుండా జరుగుతాయి. దీని గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు' అని సుజానె వెల్లడించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత విషయమని సుజానె పేర్కొన్నారు.
చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్. ఇప్పుడు సుజానె తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. ఆమె ఇద్దరు కుమారులు హ్రెహాన్, హృదాన్ తండ్రి హృతిక్ రోషన్‌తో కలిసి ఉంటున్నారు. ఇద్దరు పిల్లలను తమ తల్లిని గ్రాండ్ ఫాందర్ ఇంటికి వెళ్లి కలుస్తున్నారట.


Click it and Unblock the Notifications












