భార్య విడాకులు కోరుతోంది: హృతిక్ రోషన్ ప్రకటన
ముంబై: బాలీవుడ్ బెస్ట్ కపుల్స్‌లో ఒకరుగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్-సుజానె రోషన్ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని హృతిక్ రోషన్ స్వయంగా ప్రకటించారు. అయితే తాను విడుకులు కోరుకోవడం లేదని, తన భార్య సుజానె కోరిక మేరకే విడిపోతున్నట్లు ప్రకటించాడు.
'సుజానె నా నుండి విడిపోవాలని కోరుకుంటోంది, నాతో ఉన్న 17 ఏళ్ల బంధాన్ని తెంచుకోవాలని కోరుకుంటోంది. మా ఫ్యామిలీ మొత్తానికి ఇది చాలా కఠినమైన సమయం. మా ప్రైవసీకి కేటాయించాలని మీడియా వారికి రిక్వెస్ట్ చేస్తున్నాను' అంటూ 39 ఏళ్ల హృతిక్ రోషన్ వ్యాఖ్యానించారు.
వాస్తవారికి వీరిద్దరూ విడాకులు తీసుకోవానే ఆలోచనలో ఉన్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలు నిజమయ్యాయి. చిన్నతనం నుండే సుజానెను ప్రేమిస్తున్న హృతిక్ డిసెంబర్ 20, 2000 సంవత్సరంలో తన ప్రేయసి సుజానెను పెళ్లాడాడు. వీరికి ఇద్దరు కుమారులు. హ్రెహాన్, హృదాన్.
కొన్ని రోజుల క్రితం హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పుట్టినరోజు వేడుక గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో జరిగిన ఓ సంఘటన వీరి మధ్య విభేదాలకు కారణమైందని తెలుస్తోంది. తన తల్లిదండ్రులకు సరైన మర్యాద దక్కక పోవడం అనే అంశంతో మొదలైన గొడవ....చివరకు విడాకులకు దారి తీసిందట.
ఇప్పుడు సుజానె భర్తతో కలిసి ఉండటం లేదని, తన తల్లిదండ్రుల వద్దే ఉంటోందని తెలుస్తోంది. ఆమె ఇద్దరు కుమారులు హ్రెహాన్, హృదాన తండ్రి హృతిక్ రోషన్‌తో కలిసి ఉంటున్నారట. ఇద్దరు పిల్లలను తమ తల్లిని గ్రాండ్ ఫాందర్ ఇంటికి వెళ్లి కలుస్తున్నారని, సుజానె మాత్రం రోషన్ ఇంటి గడప తొక్కడం లేదన టాక్.


Click it and Unblock the Notifications












