twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాలుగు శతాబ్ధాల్లో జరిగే సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీ: సువర్ణ సుందరి

    కథ, కాన్సెప్ట్‌ ప్రధానంగా చరిత్రను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'సువర్ణ సుందరి'. త్రానికి సంబంధించిన షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది.

    |

    హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన సినిమాలకు ప్రస్తుతం ఆదరణ బాగా వుంటున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు కూడా అలాంటి సబ్జెక్ట్స్‌తోనే సినిమాలు తియ్యడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌లో ఇటీవల రెండు భారీ చిత్రాలు చక్కని విజయాల్ని అందుకున్నాయి. ఇప్పుడు అదే కోవలో చరిత్ర నేపథ్యంలో మరో విభిన్న చిత్రం తెరకెక్కుతోంది.

    సువర్ణ సుందరి

    సువర్ణ సుందరి

    కథ, కాన్సెప్ట్‌ ప్రధానంగా చరిత్రను ఆవిష్కరిస్తూ తెరకెక్కుతున్న చిత్రం 'సువర్ణ సుందరి'. చరిత్ర ఎప్పుడూ భవిష్యత్‌ని వెంటాడుతుంది అనేది ట్యాగ్‌లైన్‌. ఎస్‌.టీమ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సూర్య దర్శకత్వంలో ఎమ్‌.ఎల్‌ లక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ దాదాపు పూర్తయింది.

    Recommended Video

    Avunu fame Poorna going to Play Anushka's Arundhati Type Role
    నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ

    నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ

    ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సూర్య మాట్లాడుతూ - ''1509 సంవత్సరంలో ప్రారంభమై నేటి(2017) వరకూ.. అంటే నాలుగు శతాబ్ధాల్లో జరిగే కథ ఇది. సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ మూవీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. కాలాదుల్ని బట్టి వేర్వేరు లొకేషన్లలో చిత్రీకరణ చేశాం.

    పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌

    పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌

    షూటింగ్‌ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. త్వరలో టీజర్ రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. బీదర్‌, కేరళ, కాలక్కల్‌, అనంతపూర్‌, హైదరాబాద్‌, బెంగళూరు తదితర ప్రదేశాల్లో చిత్రీకరణ జరిపాం. రోలర్‌ కాస్టర్‌ స్క్రీన్‌ప్లేలో ఈ కథ ఉంటుంది.

    చీకటి కోణాలుంటాయి

    చీకటి కోణాలుంటాయి

    చరిత్ర ఎప్పుడూ విజయాల గురించి చెబుతుంది. అయితే చరిత్రలో బయటికి తెలీని చీకటి కోణాలుంటాయి. అలాంటి ఓ చీకటి కోణం ఇప్పటివరకు రకరకాల జనరేషన్లపై ఎలాంటి ప్రభావం చూపించింది అన్నదే ఈ చిత్రంలోని ప్రధాన కథాంశం. అప్పటి జనరేషన్‌, ఇప్పటి జనరేషన్‌ గ్యాప్‌ని అర్థవంతంగా చూపించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.

    హై క్వాలిటీ విజువల్స్‌

    హై క్వాలిటీ విజువల్స్‌

    విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఈ చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యం వుంటుంది. ప్రతి సెట్‌కి సి.జి. వర్క్‌ చేస్తున్నాం. హైదరాబాద్‌, పూణే, ముంబైలలో సీజీవర్క్‌ జరుగుతోంది. హై క్వాలిటీ విజువల్స్‌ చేస్తున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం'' అన్నారు. పూర్ణ, సాక్షిచౌదరి, రామ్‌, ఇంద్ర, సాయికుమార్‌, నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ ఖాన్‌, అవినాష్‌ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా: ఎల్లు మహంతి, సంగీతం: సాయి కార్తిక్‌, ఎడిటింగ్‌: పవ్రీణ్‌ పూడి.

    English summary
    Suvarna Sundari which comes under supernatural thriller genre. The makers are confident of scoring a hit with the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X