»   » యాంకర్ సుమ పాడిన సాంగులో.... అనసూయ హాట్ లుక్ (వీడియో)

యాంకర్ సుమ పాడిన సాంగులో.... అనసూయ హాట్ లుక్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సెక్సీ యాటిట్యూడ్, చలాకీ తనం, ఆకట్టుకునే అందంతో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. క్రమ క్రమంగా అనసూయ సినిమాల వైపు రావడం... నాగార్జున సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలో సూపర్ హాట్ అండ్ సెక్సీగా నటించడం తెలిసిందే. తాజాగా ఆమె సాయి ధరమ్ తేజ్ మూవీలో స్పెషల్ సాంగ్ చేస్తోంది.

సూయ సూయ అంటూ సాంగే ఈ స్పెషల్ సాంగును ప్రముఖ యాంకర్ సుమ కనకాల పాడటం విశేషం. తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ ద్వారా రిలీజైంది. ఈ సాంగ్ లో అనసూయ హాట్ అండ్ సెక్సీ లుక్ తో అలరించబోతోంది.

rn

సూయ సూయ అనసూయ

గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న 'విన్నర్' చిత్రాన్ని ఠాగూర్ మధు, నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి) కలిసి లక్ష్మీ నరసింమా ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు. ఇటీవలే సాయి ధరమ్ తేజ్, అనసూయలపై పాటను చిత్రీకరించారు.

సెట్స్ లో

సెట్స్ లో

డాన్స్ మాస్టర్ రాజు సుందరం కొరియోగ్రఫీలో ఈ సూయ సూయ పాటను చిత్రీకరించారు. షూటింగ్ సయంలో సెట్స్ లో మూవీ టీంతో కలిసి దిగిన ఫోటోను అనసూయ సోషల్ మీడియా ద్వారా పోస్టు చేసింది.

యాంకర్ సుమ

యాంకర్ సుమ

సంగీత దర్శకుడు తమన్ ...పలు సినీ పంక్షన్స్ లో సుమ గొంతు విని..ఆమెను పాట పాడటానికి ఒప్పించారు. మళయాళంలో పుట్టినా, తెలుగు టీవి ప్రపంచంలో సుమ నెంబర్ వన్. తెలుగుని తెలుగులో చాలా మంది కన్నా స్పష్టంగా పలకుతూ మాట్లాడటం ఆమె స్పెషాలిటి. అలాంటి ఆమె ఏకంగా తెలుగులో పాట పాడి సంచలనం సృష్టించబోతోంది. అదీ అనసూయ కాంబినేషన్ లో అంటే దుమ్మురేపటం ఖాయం కదా.

అనసూయ దశ తిరుగుతుందా

అనసూయ దశ తిరుగుతుందా

విన్నర్ సినిమాలో అనసూయ చేసిన సూయ సూయ సాంగ్ హిట్టయితే ఆమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం అంటున్నారు.

English summary
Watch & Enjoy Suyaa Suyaa Full Song With Lyrics From Winner Telugu Movie. Starring Sai Dharam Tej, Rakul Preet, Jagapathi Babu, Music Composed by Thaman SS, Directed by Gopichand Malineni and Produced by Nallamalupu Bujji and Tagore Madhu under the Banner of Lakshmi Narashima Productions.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu