ఆవు కథతో మహేష్ బాబుని పోల్చిన కృష్ణారెడ్డి
ఇందరి సమక్షంలో మహేష్ బాబు అనే పెళ్లి కొడుకు..ఏ రేంజికి వెళ్తున్నాడు అంటే...ఒక్కొక్క స్టెప్ అతనొక్కడు మాత్రమే వెయ్యగలడు అంటూ ఆవు కథని చెప్పారు కృష్ణారెడ్డి. ఏదన్నా వ్యాసం చెప్పు అని స్కూల్లో అడిగినప్పుడు..కుర్రాడు..ఆ వ్యాసం గురించి మొదలుపెట్టి..అవు తెల్లగా ఉంటుంది..ఆవు పాలిస్తుంది అంటూ ఆవు దగ్గరకు వెళ్లిపోతాడు. ఇప్పుడు మహేష్ ని గురించి చెప్పు అంటే ఈ కథ సరిపోయేటట్లు ఉంది అంటూ ప్రముఖ దర్శకుడు ఎస్ వి కృష్ణారెడ్డి ..బిజినెస్ మ్యాన్ చిత్రం గురించి చెప్పుకొచ్చారు.అలాగే.. సినిమాలో డైరక్షన్ సూపర్ గా ఉంది...చూసావా కదా నువ్వు సినిమా గురించి చెప్పు...డైలాగులు అదిరిపోయాయి..ఏం రాసాడు సార్ డైరక్టర్...డైలాగులు అదిరిపోయాయి..ఆ డైలాగులు మహేష్ బాబు బ్రహ్మాండంగా చెప్పాడు..సూపర్ గా యాక్టింగ్ చేసాడు.ఆ ఫెరఫార్మెన్స్ అదిరిపోయింది.ఎక్సప్రెషన్ అదిరిపోయింది అంటూ మహేష్ గురించే చెప్తాడు.
మరి మ్యూజిక్ గురించి చెప్తూ..సాంగ్ లు అన్నీ బాగున్నాయండి...అని మహేష్ ఆ పాటల్లో బాగున్నాడు..స్టెప్పలు బాగున్నాయి అంటాడు. మరి ఫోటొగ్రఫి గురించి చెప్పు అంటే...కలర్స్ అన్నీ ఎక్సట్రార్డనరీగా ఉన్నాయి. అందులో మహేష్ బాబు ని చూస్తుంటే మతిపోతోంది అంటూ చెప్తాడు. అలా మహేష్ బాబు..మహేష్ బాబు అని ఏ డిపార్టమెంట్ గురించి అడిగినా చెప్తాడు. అయితే మహేష్ గొప్పతనం ఏమిటి అంటే..మొన్నా మధ్య స్టేట్ మెంట్ లో ఒకళ్ల వల్ల సినిమా హిట్టవదు...అని అన్నారు. ఆ గొప్ప సంస్కారం ఆయన దగ్గర ఉంది. అది ఎక్కడి నుంచో వచ్చింది కాదు...తండ్రి కృష్ణగారి గురించి చెప్పాలి అంటూ పొగిరారు.


Click it and Unblock the Notifications











