‘యమలీల’లో హీరోయిన్‌గా సౌందర్య.. అడ్వాన్స్ కూడా... గుట్టు విప్పిన ఎస్వీ కృష్ణారెడ్డి
ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల చిత్రానికి ఎంతో చరిత్ర ఉంది. ఆ సినిమా పుట్టుక, హీరో హీరోయిన్ల ఎంపిక విషయంలోనూ ఎన్నో ట్విస్ట్‌లున్నాయి. మొదటగా ఈ మూవీని మహేష్ బాబు కోసం అనుకున్నారు. కానీ చివరకు అలీ చేతిలో పడింది. ఇక హీరోయిన్ విషయంలోనూ ఎన్నో మలుపులు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు కొన్ని విషయాలు బయటకు చెప్పని ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా అసలు గుట్టు బయట పెట్టేశాడు.

సౌందర్యకు అడ్వాన్స్..
యమలీల సినిమా విషయంలో జరిగిన ఘటనలను ఎస్వీ కృష్ణారెడ్డి తాజాగా బయట పెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. యమలీల సినిమా కోసం అలీని హీరోగా ఫిక్స్ అయిపోయాం. ఇక హీరోయిన్‌గా సౌందర్యను అనుకున్నాం.. అచ్చిరెడ్డి సౌందర్యకు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారంటూ చెప్పుకొచ్చాడు.

అలీ పక్కన నో..
అయితే కొన్ని రోజుల తరువాత సౌందర్య మాట మార్చేసిందట. అలీ పక్కన హీరోయిన్‌గా చేయలేను. ఇప్పుడు పెద్ద హీరోల పక్కన హీరోయిన్‌గా చేస్తున్నాను కదా మీరే ఓ సారి ఆలోచించండి అని ఎస్వీ కృష్ణారెడ్డి సౌందర్య చెప్పుకొచ్చిందట. ఎస్వీ కృష్ణారెడ్డి హీరోగా చేస్తానంటూ సౌందర్య రెడీ అని చెప్పిందట.

అప్పుడు చేస్తావా?
అలా సౌందర్య అనడంతో ఎస్వీ కృష్ణారెడ్డి ఓ ప్రశ్న వేశారట. ఇప్పుడు అలీని తక్కువ అంచనా వేస్తున్నావా? రేపు అలీ ఓ పెద్ద హీరో అయితే అప్పుడు కూడా ఇలానే అంటావా? అని సౌందర్యను సూటిగా అడిగేశాడట. ఒకవేళ అలా జరిగితే.. అప్పుడు పరిస్థితులను బట్టి చేస్తానేమో అని సౌందర్య బదులిచ్చిందట.

ఆ తరువాత అలా..
సౌందర్య అలా తన నిర్ణయాన్ని చెప్పడంతో ఇంద్రజను హీరోయిన్‌గా ఎంచుకున్నారట. అయితే యమలీల బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, అందరికీ మంచి పేరు రావడం జరిగిపోయింది. అయితే ఆ తరువాత శుభలగ్నం సమయంలో సౌందర్య మళ్లీ కాల్ చేసిందట.

అది వెలితిగా..
శుభలగ్నం సినిమాలో అలీ పక్కన స్పెషల్ సాంగ్ ఉందని తెలుసుకుని సౌందర్యే కాల్ చేసిందట. ఆ రోజు యమలీల మిస్ అయ్యాను.. ఇప్పుడు ఈ చాన్స్ మాత్రం మిస్ కాను.. యమలీల చేయలేదన్న వెలితి ఉంది.. ఇప్పుడు ఇది మాత్రం చేస్తాను.. మిస్ కాను అని సౌందర్యే అడిగిందట.


Click it and Unblock the Notifications











