ఒకప్పుడు వరస హిట్లతో ఫ్యామిలీ చిత్రాలు తీసిన కృష్ణారెడ్డి ప్రెజెంట్ ట్రెండ్ ని అందుకోలేక వెనుకపడ్డారు. దాంతో చాలా గ్యాప్ అనంతరం ఇప్పుడో కామిడీ చిత్రానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందులో శివాజి,అలీ,శ్రీనివాస రెడ్డి ముగ్గురూ హీరోలుగా చేస్తున్నారు. జీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా పై అందరూ చాలా ఆశలే పెట్టుకున్నారు. అయితే కామిడీ కొత్త తరహాలో ఉంటేనే వర్కవుట్ అవుతుందని...ప్రస్తుతం వరసగా కామిడీ పేరుతో చెత్త చిత్రాలు వస్తున్నాయని అంతా అంటున్నారు. మరి కృష్ణా రెడ్డి స్టాక్ క్యారెక్టర్లు ,రొటీన్ కామిడీ జోలికి వెళ్ళకుండా ఉంటేనే గెలిచే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ వేట జరుగతోంది. అలాగే జీ ఫిలిమ్స్ వారు చంద్రసిద్దార్ద,ఈశ్వర రెడ్డి దర్శకత్వంలో మరో రెండు సినిమాలు త్వరలో ప్రారంభించనున్నారు.అయితే కృష్ణా రెడ్డి మంచి కసి మీద ఉన్నారని...ఎట్టి పరిస్ధితుల్లోనూ హిట్టివ్వటానికి ప్రిపేరు అవుతున్నారని అంటున్నారు.