యమలీల-2 రిలీజ్ డేట్ వచ్చేసింది

By Bojja Kumar

హైదరాబాద్: హైదరాబాద్: సతీష్, దియా నికోసల్ హీరో హీరోయిన్లుగా, యముడిగా మోహన్ బాబు నటించిన చిత్రం ‘యమలీల-2'. ఎస్.వి.కృష్ణా రెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి ఆశీస్సులతో క్రిష్వీ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదలకు సిద్ధమైంది.

ఈ సందర్భంగా దర్శకుడు ఎస్.వి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘యమలీల చిత్రానికి ఈ సినిమా సీక్వెల్ కాదని, అయితే వినోదం పంచడంలో అందరికీ నచ్చే విధంగా ఉటుంది. యముడిగా మోహన్‌బాబు, చిత్రగుప్తుడుగా బ్రహ్మానందం పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయని, ఇటీవల విడుదలైన పాటలకు మంచి ఆదరణ లభిస్తోందని, ఆ పాటలు వినడానికే కాక చూడటానికి కూడా అందంగా ఉంటాయని తెలిపారు.

SV Krishna Reddy's Yamaleela 2 in theatres from Nov 28

హీరో సతీష్ మాట్లాడుతూ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా కథానాయకుడిగా నటిస్తుండడం చాలా ఆనందంగా ఉందని, ఇటీవల విడుదలైన ఈ సినిమాలోని పాటలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో త్వరలో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుపనున్నామని, ప్రపంచ వ్యాప్తంగా 500 థియేటర్లలో ఈ నెల 28న విడుదల చేస్తున్నామని తెలిపారు.

దియా నికోలస్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, ఎం.ఎస్.నారాయణ, పోసాని కృష్ణమురళి, రావూ రమేష్, సదా, నిషా కొఠారి, ఆశీష్ విద్యార్థి, షాయాజీ షిండే, గీతాంజలి, బేబి హర్షిత, అనంత్, సమీర్, ఉత్తేజ్, జోగి బ్రదర్స్, తా.రమేష్, ప్రియ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కెమెరా:శ్రీకాంత్ నౌరోజ్, ఎడిటింగ్:గౌతంరాజు, మాటలు:గంగోత్రి విశ్వనాధ్, భవాని ప్రసాద్, నిర్మాత:ఆశా సతీష్, కథ, స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్.వి.కృష్ణారెడ్డి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X