గతజన్మ రహస్యం: బన్నీకి గుప్తనిధి, పవన్ హత్య, రాజమౌళి ఫెయిల్యూర్, ఎన్టీఆర్ యోధుడు...

ఎస్వీ నాగనాథ్ అనే ఆస్ట్రో సైకాలజిస్ట్ సినీ స్టార్ల గత జన్మల గురించి తెలిపారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రాజమౌళి, ఎన్టీఆర్ గత జన్మ రహస్యాలు బయట పెట్టారు.

By Bojja Kumar

హైదరాబాద్: గత జ‌న్మ ఉంటుందా? మరో జన్మకు అవకాశం ఉందా? అనే విషయాల్లో నిజం ఎంతో తెలియదు కానీ.... నమ్మేవారు నమ్ముతున్నారు, నమ్మని వారు నమ్మడం లేదు. అయితే ఇలాంటి విషయాలను బేస్ చేసుకుని ఇటీవల ప్రసారం అయిన ఓ కార్యక్రమంలో తెలుగు సినీ స్టార్ల గత జన్మల గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఎస్వీ నాగనాథ్ అనే ఆస్ట్రో సైకాలజిస్ట్ టాలీవుడ్ స్టార్లు పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జూ ఎన్టీఆర్, రాజమౌళి తదితరులకు సంబంధించిన గత జన్మ విశేషాలు వెల్లడించారు. గత జన్మలో ఈ స్టార్లు ఎక్కడ జన్మించారు? ఎలాంటి జీవితం గడిపారు అనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్ గత జన్మలో ఉత్తర భారత దేశంలో జన్మించారట. సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన అతడు ఎక్కువగా తల్లి యొక్క అడుగు జాడల్లో జీవితం గడిపాడట. చిన్నప్పటి నుండి చాలా చలాకీగా ఉండటం అందరితో కలిసి పోవడం, అందరి వ్యక్తిగత జీవితాల్లో ఎలాంటి సమస్యలున్నా కూడా వాటికి సొల్యూషన్ చెప్పడం లాంటివి బాల్యం నుండి అతనికి అలవడిన వ్యక్తిత్వం అని నాగనాథ్ తెలిపారు.

జలభగీరథుడుగా పేరు

జలభగీరథుడుగా పేరు


గత జన్మలో అల్లు అర్జున్ దేన్నయినా క్లియర్ గా చెప్పే వాగ్ధాటి ఉన్న వ్యక్తి. గత జన్మలో అతడికి ఇద్దరు అమ్మాయిలు. తన ఊరికి, ప్రాంతానికి మేలు చేసిన వ్యక్తి. జలభగీరథుడు అనే పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో రకాల ఆటుపోట్లను ఎదుర్కొని తనకంటూ ఓ వ్యక్తిత్వాన్ని చాటుకున్న గ్రహస్థితి అతని గత జన్మలో ఉందని నాగనాథ్ తెలిపారు.

గుప్తనిధులు దొరికాయి

గుప్తనిధులు దొరికాయి

అల్లు అర్జున్ గత జన్మలో టర్నింగ్ పాయింట్ ఒకటి జరిగింది. కుటుంబం ఆర్థికంగా దెబ్బతిని ఆస్తులన్నీ పోయిన స్థితి వచ్చింది. పెళ్లి తర్వాత బ‌న్నీ అనుకోకుండా ఆపార గుప్త‌నిధి సొంతం చేసుకున్నాడు. హనుమంతుడిని భక్తుడైన బన్నీ ఆ నిధిని అంతా స‌మాజ శ్రేయ‌స్సుకు ఉప‌యోగించాడ‌ని అతడి గ్రహస్థితిలో ఉందని నాగనాథ్ తెలిపారు.

రాజమౌళి గత జన్మ చాలా దారుణంగా

రాజమౌళి గత జన్మ చాలా దారుణంగా

ఇపుడు మనకు తెలిసిన రాజమౌళి పాస్ట్ లైఫ్... చాలా పాథటిక్, డిజాస్టర్, డిస్ట్రబ్డ్ లైఫ్ అనుభవించారని నాగనాథ్ తెలిపారు. గత జన్మలో అతడికి తండ్రి నుండి ఎటువంటి సహకారం, ప్రోద్బలం లేదని నాగనాథ్ తెలిపారు.

ప్రేమించిన అమ్మాయికి దూరమైన రాజమౌళి

ప్రేమించిన అమ్మాయికి దూరమైన రాజమౌళి

రాజమౌళి గత జన్మలో తన ఆర్థిక, సామాజిక పరిస్థితి కారణంగా చివరకు ప్రేమించిన అమ్మాయికి దూరం అయ్యాడు. వివాహం లేకుండా బ్యాచిలర్ లైఫ్ లీడ్ చేశాడు. చాలా సున్నితమైన మనస్తత్వం. దురదృష్టం ఎప్పుడూ తన వెంటే నీడలా ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించి తన బుద్ది ద్వారా తన ఆలోచన ద్వారా తన పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి. తనకంటూ కెరీర్ ఎంచుకుని ఓ సోషల్ యాక్టివిస్ట్ గా, సోషల్ సర్వీస్ ఓరియెంటెడ్ పర్సనాలిటీగా అతడు గత జన్మలో గడిపినట్లు అతడి గ్రహస్థితిలో ఉందని నాగనాథ్ తెలిపారు.

అపుడు అదే అతడి సంతోషం

అపుడు అదే అతడి సంతోషం

గత జన్మలో రాజమౌళి చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు. తనకంటూ ఏడుపొస్తే కూడా కంట్లో నుండి నీళ్లు కూడా రాలేనటువంటి సున్నీతమైన జీవితం గడిపారు. జీవితం అంటే మనమే సంతోషంగా ఉండటం కాదు.... మన చుట్టూ ఉండే వారిని కూడా సంతోషంగా ఉంచడం అనే ఫిలాసఫితో జీవితాన్ని గడిపారని నాగనాథ్ తెలిపారు.

గత జన్మలో రాజుగా పవన్ కళ్యాణ్

గత జన్మలో రాజుగా పవన్ కళ్యాణ్

గత జన్మలో పవన్ కళ్యాణ్ ఉత్తర ఈశాన్య ప్రాంతంలో జన్మించాడు. అతడొక రాజుల వంశంలో జన్మించాడు. గుప్త దానాలు చేసే అలవాటు ఆ జన్మలో ఉండేది. ఇతడి జాతకంలో వ్యక్తిగత జీవితంలో పెళ్లికి సంబంధించి అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. చాలా మొండి స్వభావం, ముక్కుసూటి మనిషి అని నాగనాథ్ తెలిపారు.

గత జన్మలో పవన్ కళ్యాణ్ వివాహాలు

గత జన్మలో పవన్ కళ్యాణ్ వివాహాలు

పవన్ కళ్యాణ్ గత జన్మలో కన్యా లగ్నంలో జన్మించారు. ఎంతో రొమాంటిక్ పర్సన్, ఎంతో నాచురల్ గా, ఎంతో చార్మింగ్ గా ఎంతో అట్రాక్టివ్ గా ఉన్నటు వంటి లగ్నంలో జన్మించారు. ఇప్పటి జన్మలోలాగే గత జన్మలోనూ అతడు వివాహ స్థితి ఉందని నాగనాథ్ తెలిపారు.

హత్య చేయబడ్డాడు

హత్య చేయబడ్డాడు

గత జన్మలో పవన్ కళ్యాణ్ తనొక నిర్ణయం తీసుకుంటే పరిణామాలు ఎలా ఉన్నా గానీ దానిని ముందుకు తీసుకెళ్లే ధైర్యం, చొరవ కలిగిన వ్యక్తి. కానీ అతనికి సామాజికంగా ఉండేటటువంటి కోణంలో ఇన్‌ఫ్యూయెన్స్ అవ్వడం కంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడే గ్రహస్థితిలో ఆయన పూర్వ జన్మలో జన్మించాడు. అతడికి ఆరోగ్యం క్షీణించేలా మెడిసిన్ ఇచ్చి అతన్ని చంపేయబడ్డట్లు అతడి గత జన్మలో ఉందని నాగనాథ్ తెలిపారు.

జూ ఎన్టీఆర్ గత జన్మ

జూ ఎన్టీఆర్ గత జన్మ

ఎన్టీఆర్ గత జన్మలో ఆరుడుగల ఆజానుబాహుడు. అపారమైన తేజస్సు, ఛాయ కలిగి ఉన్నాడు. అతడికి తెలిసినవి రెండే... శత్రువును సంహరించడం, అతనికి దాసోహం అయిన వారిని కాపాడటం. అదే అతడి పూర్వ జన్మ గ్రహస్థితి. ఆయన జన్మించిన ప్రాంతం దక్షిణ భారత దేశం, ట్రైబల్ ప్రాంతంలో యోధుడిగా జన్మించాడు. మన జీవితానికి నమ్మకం లేదు అనే భావోద్వేగాలతో బాల్యం గడిచింది. ఇతడు ప్రత్యర్థులందరినీ మట్టుపెట్టే ప్రయత్నం చేసి అన్ని సార్లు సక్సెస్ అయ్యాడని గ్రహస్థితిలో ఉందని నాగనాథ్ తెలిపారు.

చివరి రోజుల్లో మానిసకంగా...

చివరి రోజుల్లో మానిసకంగా...

యొధుడు ప్రపంచాన్ని గెలవగలడు కానీ ఆలోచనను గెలవలేడు. చివరి రోజుల్లో అతడు కనిపించని శత్రువుతో మానసికంగా పోరాటం చేశాడు. అతడు ఒంటరిగా మానసిక వ్యాధితో ఉన్నపుడే శత్రవులు అతడిని అంత మొందించడానికి కారణమైందని గ్రహస్థితిలో ఉందని నాగనాథ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X